ఎన్నికల వేళ వైసీపీలో సొంత పోరు

ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు.. ఏకగ్రీవం అయ్యాయని వైసీపీ సంతోషంగా ఉంది. దౌర్జన్యాలు చేశారని టీడీపీ ఆరోపించినా… బెదిరించారని జనసేన, బీజేపీలు చెబుతున్నా.. ఏకగ్రీవాలు మాత్రం వైసీపీకి అదనపు బలమే.…

ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు.. ఏకగ్రీవం అయ్యాయని వైసీపీ సంతోషంగా ఉంది. దౌర్జన్యాలు చేశారని టీడీపీ ఆరోపించినా… బెదిరించారని జనసేన, బీజేపీలు చెబుతున్నా.. ఏకగ్రీవాలు మాత్రం వైసీపీకి అదనపు బలమే. అయితే మిగతా చోట్లే పరిస్థితి విచిత్రంగా కనిపిస్తోంది. మున్సిపాల్టీల్లో నామినేషన్ల చివరి రోజున ఈ విషయం స్పష్టమైంది.

అధికార పార్టీకి చెందిన వారే పోటాపోటీగా నామినేషన్లు వేశారు. మంత్రుల నియోజకవర్గాల్లో తప్ప.. మిగతా అన్నిచోట్ల ఈ సమస్య అధికంగా ఉంది. మున్సిపల్ చైర్మన్ల రేసులో ఎవరున్నారో బైటకు చెప్పకపోవడంతో.. ఆశావహులు తెగ టెన్షన్ పడిపోతున్నారు. తమకి పోటీ వస్తారు అనుకున్నవారిపై డమ్మీ అభ్యర్థులను బరిలో దింపుతున్నారు. ఇలా వైసీపీ నేతలే పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఈ సమస్య కనిపించలేదు కానీ, మున్సిపాల్టీల్లో మాత్రం పోటీ ఎక్కువగా ఉంది.

ఉదాహరణకు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి మున్సిపాల్టీలో 25 వార్డులకు 158 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో దాదాపు 100 నామినేషన్లు అధికార పార్టీకి చెందినవే. ఉపసంహరణల రోజు ఎవరు తల ఎగరేసినా అధిష్టానానికే నష్టం, పోటీ అనివార్యమవుతుంది, పార్టీ కేడర్ నిలువునా చీలిపోతుంది.

ఇక పార్టీ బి-ఫారాలు ఇచ్చే సమయంలో కూడా ఎమ్మెల్యేలకు తలనొప్పులు తప్పవు. నెల్లూరు జిల్లాతో పాటు, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తోంది. అధికార పార్టీ అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితులున్న చోట్ల, నామినేషన్ల ఉపసంహరణ.. నిజంగానే రణరంగాన్ని తలపించకమానదు.

ఎలాగోలా టీడీపీని పోటీలో లేకుండా చేసినా, సొంత పార్టీ నాయకులతోనే వైసీపీకి తిప్పలు తప్పడంలేదు. స్థానిక బరిలో ఈ సమస్యని పార్టీ ఎలా అధిగమిస్తుందో చూడాలి.

నేను రవితేజ అనుష్క కాళ్ళపై పడి ఆశీర్వాదం తీసుకునే వాళ్ళం

స్క్రిప్టులో వేలు పెట్టట్లేదు..