ముఖ్యమంత్రి జగన్ కి జనం 2019 ఎన్నికల్లో పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ఏకంగా 151 సీట్లు ఆయనకు ఇచ్చి అగ్రాసనం మీద కూర్చోబెట్టారు.
ఇక జగన్ సైతం తాను చెప్పిన మాటను, ఇచ్చిన హామీనీ తప్పకుండా తీరుస్తూ గత ఇరవై నెలల్లో జనానికి మరింత చేరువ అయ్యారు.
పంచాయతీ ఎన్నికలు జరిగితే వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో గత నెలలో అంతా చూశారు. ఇపుడు మునిసిపల్ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు పూర్తిగా వైసీపీకి అనుకూలంగా ఉంటాయని మంత్రి అవంతి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ కార్పొరెషన్ ని మంచి మెజారిటీతో గెలిచి జగన్ కి కానుకగా ఇస్తామని ఆయన అంటున్నారు. విశాఖకు కాబోయే మేయర్ తమ పార్టీ వారే ఉంటారని అవంతి కచ్చితంగా చెబుతున్నారు.
ఇక వైసీపీకి కార్పొరేషన్ ఎన్నికల్లో మెజారిటీ రాకుండా చేయడానికే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పోలింగునకు రెండు రోజుల ముందు విశాఖ స్టీల్ ప్రైవేటికరణ మీద ప్రకటన చేశారా అన్న మీడియా ప్రశ్నకు మంత్రి సమాధానం సూటిగా చెప్పలేదు.
ఎవరేం చేసినా జనాలు మాత్రం వైసీపీకే ఓటు వేశారని, కౌంటింగులో అది రుజువు కాబోతోంది అని చెప్పడం విశేషం.