మనం మెసేజ్ ల యుగంలో ఉన్నాం. ఇప్పుడు భావ ప్రకటనలో మాటల కన్నా.. వాట్సాప్ మెసేజ్ లే ఎక్కువ స్థానాన్ని ఆక్రమించాయి. భార్యాభర్తల బంధం కూడా దానికి అతీతం కాదు. దూరదూరంగా ఉన్నప్పుడు అయితే.. అనునిత్యం వాట్సాప్ మెసేజ్ ల ద్వారా టచ్ లో ఉండే వారు ఎంతో మంది! పదేళ్ల కిందటి వరకూ ఒక్క మెసేజ్ పంపాలన్నా ఎంతో కొంత ఖర్చుతో కూడుకున్న పని. ఇంటర్నెట్ సేవలు పరిమిత ధరకే అందరికీ అందుబాటులోకి రావడంతో.. టెక్ట్సింగ్ ఒక భావ ప్రకటనా మార్గం అయ్యింది. ఇప్పుడు అన్ని ఫీలింగ్స్ నూ వాట్సాప్ ద్వారా పట్టాలెక్కించి, చేర్చాల్సిన వారికి చేర్చేస్తూ ఉన్నారంతా.
మరి ఇలాంటి పరిస్థితుల్లో.. టెక్ట్సింగ్ కొత్త పుంతలు కూడా తొక్కింది. అది దాంపత్యబంధంలోనో, ప్రేమ బంధంలోనో అయితే.. తమ ప్రేమప్రకటనకూ, తమ భావ ప్రకటనకు, తమ అవసరాన్ని చెప్పుకోవడానికి.. వీటన్నింటితో పాటు.. తమ సెక్సీ ఫీలింగ్స్ ను షేర్ చేసుకోవడానికి కూడా వాట్సాప్ ను మార్గంగా ఎంచుకుంటున్న తరం ఇది.
మాటల్లో చెప్పడానికి అనువుగాని కొన్ని విషయాలను టెక్ట్స్ చేసుకోవచ్చు. వీటిల్లో దంపతులు, ప్రేమికుల మధ్యన కొంత ఎరోటిక్ టెక్ట్స్ కూడా ఉండనే ఉంటుంది. మరి వీటిల్లో మగువుల నుంచి తమ ప్రియసఖుడికి వెళ్లే టెక్ట్స్ ను ఎలా అర్థం చేసుకోవాలనేది కూడా మగాళ్లకు అంత తేలికైన పనేమీ కాదు. గొంతు వినిపించదు, అక్షరాలు మాత్రమే కనిపిస్తాయి కాబట్టి.. ఏ భావంతో చెబుతున్నట్టో అర్థం చేసుకోలేకపోవచ్చు. మరి ఈ అంశంపై పట్టు కలిగిన వారు చెప్పే మాటేమిటంటే.. మిస్ యూ అనే మెసేజ్ గనుక భార్య నుంచినో, ప్రియురాలి నుంచినో వచ్చిందంటే.. దాన్ని చాలా సీరియస్ గానే తీసుకోవాలి!
ఈ క్షణంలో నిన్ను చాలా మిస్ అవుతున్నా.. నువ్వు నాతో ఉండాల్సింది.. అనే మెసేజ్ కనుక ఆమె నుంచి వస్తే.. అందులో చాలా చాలా లోతు ఉన్నట్టే! నిజంగానే గట్టిగా కోరుకుంటేనే మగువ నుంచి ఈ మెసేజ్ వస్తుందనే విషయాన్ని గుర్తించాలి.
అయితే ఇక్కడ కూడా మరో లెక్క ఉంటుంది. మిస్ అవుతున్నట్టుగా మెసేజ్ చేయడమే కాదు.. కొంతమంది మగువలు తమ కోరికను కూడా మెసేజ్ రూపంలో వ్యక్తం చేయగలరు. కానీ.. అందుకు మగవాడి తీరు కూడా ప్రభావితం చేస్తుంది. ఇలా మెసేజ్ చేస్తే ఏమైనా అనుకుంటాడేమో అనే అనుమానం, ఆ ఆలోచన మగువకు ఉంటే.. హాట్ చాట్ కు అవకాశమే ఉండదు.
తన భర్త లేదా ప్రియుడు ఎంత ఎరోటిక్ టెక్ట్స్ ను ఇష్టపడతారో మగువలు గ్రహించలేనిది ఏమీ కాదు. అతడి తీరును బట్టే.. వారు తమను తాము మార్చుకునే అవకాశాలున్నాయి. ఇద్దరూ ఎరోటిక్ మెసేజ్ లను ఎంజాయ్ చేసే తత్వమే కుదిరితే.. టెక్ట్సింగ్ కాస్తా సెక్ట్సింగ్ గా మారుతుందని వేరే చెప్పనక్కర్లేదు!