వైసీపీ ఎమ్మెల్యేకి నో చెప్పిన స్పీకర్

ఆంధ్రప్రదేశ్ గత శాసనసభలో రూల్స్ ఎలా తుంగలో తొక్కి ప్రతిపక్ష్యం గొంతు ఎలా నొక్కి పెట్టేవారో చూశాము. కానీ నేటి స్పీకర్ అందరి మన్ననలను పొందుతున్నారు. దానికి నిలువెత్తు సాక్షం నిన్నటి సభలో జరిగిన…

ఆంధ్రప్రదేశ్ గత శాసనసభలో రూల్స్ ఎలా తుంగలో తొక్కి ప్రతిపక్ష్యం గొంతు ఎలా నొక్కి పెట్టేవారో చూశాము. కానీ నేటి స్పీకర్ అందరి మన్ననలను పొందుతున్నారు. దానికి నిలువెత్తు సాక్షం నిన్నటి సభలో జరిగిన పరిణామం. ఈ సభలో రూల్ ఎవరికైనా ఒకటేనని స్పీకర్ తమ్మినేని సీతారామ్ స్పష్టంచేశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు తన సీటులో నుంచి కాకుండా వేరే సీటు నుంచి మాట్లాడే యత్నంచేయగా ఆయన అందుకు అంగీకరించలేదు.

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి పేరు పిలిచే సమయంలో ఆయన తన సీటులో కాకుండా వేరే సీటులో కూర్చున్నారు. స్పీకర్‌ ఆయన సీటు వైపు చూడగా అక్కడ ఆయన కనిపించలేదు. మరోచోట లేచి నిల్చొని.. ఇక్కడి నుంచే మాట్లాడతానని, మైకు ఇవ్వాలని కోరారు. ‘నో నో అలా కుదరదు.. మీ సీట్లోకి రండి’ అని సభాపతి సూచించారు. ఎమ్మెల్యే తటపటాయిస్తుండగా వెంటనే మరో ఎమ్మెల్యేకు అవకాశం ఇచ్చారు. మధుసూదన్‌రెడ్డి తన సీట్లోకి వచ్చాకే అవకాశం ఇచ్చారు.

రాజకీయ నటన కంటే సినిమాల్లో నటన మంచిది