ఎల్లో ప‌త్రిక‌, చాన‌ల్‌కు మాత్ర‌మే వివ‌రాలెలా?

వైసీపీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు న‌మోదైన కేసుల‌ను మూసి వేయ‌డంపై సంబంధిత కోర్టుల మేజిస్ట్రేట్లు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను త‌ప్పు ప‌డుతూ హైకోర్టు ప‌రిపాల‌న‌ప‌ర‌మైన అధికారం ద్వారా సుమోటోగా విచార‌ణ జ‌రప‌డంపై…

వైసీపీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు న‌మోదైన కేసుల‌ను మూసి వేయ‌డంపై సంబంధిత కోర్టుల మేజిస్ట్రేట్లు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను త‌ప్పు ప‌డుతూ హైకోర్టు ప‌రిపాల‌న‌ప‌ర‌మైన అధికారం ద్వారా సుమోటోగా విచార‌ణ జ‌రప‌డంపై చ‌ర్చ‌కు దారి తీసింది. ఈ సంద‌ర్భంగా విచార‌ణ జ‌ర‌ప‌డాన్ని రాష్ట్ర అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ (ఏజీ) ఎస్‌.శ్రీ‌రామ్ తీవ్ర అభ్యంత‌రం తెలి పారు.

నేర శిక్షా స్మృతి (సీఆర్‌పీసీ) సెక్షన్లు 397, 401, 482, 483ల కింద ఉన్న అధికారాలను ఉపయోగించి హైకోర్టు పాలనా పరంగా సుమోటో చర్యలను ప్రారంభించడానికి వీల్లేదని హైకోర్టుకు నివేదించారు. అసలు హైకోర్టు పాలనాపరంగా నిర్ణయం తీసుకోవడానికి, సుమోటో చర్యలకు దారి తీసిన పరిస్థితులు ఏమిటో రిజిస్ట్రీ ఇప్పటి వరకు తమకు తెలియ చేయలేదన్నారు. ఈ సందర్భంగా హైకోర్టులో జ‌రిగిన విచార‌ణ‌లో భాగంగా ఏజీ అనేక వ్యాల్యూడ్‌ అంశాలను ప్ర‌స్తావించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వానికి కూడా అంద‌ని, తెలియ‌ని కేసు వివ‌రాలు ఓ ప‌త్రిక‌, చాన‌ల్‌కు మాత్ర‌మే ఎలా అందాయ‌ని ఏజీ ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. హైకోర్టు విచాణ‌లో భాగంగా ఏజీ వాద‌న ఎలా సాగిందంటే…
 
“సుమోటో విచారణకు దారి తీసిన కారణాలు, అడ్మినిస్ట్రేటివ్‌ కమిటీ నివేదికను హైకోర్టు మాకు (ప్ర‌భుత్వానికి) ఇవ్వనేలేదు. అడ్మినిస్ట్రేటివ్‌ కమిటీ గురించి ఓ పత్రికలో మాత్రం అన్ని వివరాలు ప్రచురిత మయ్యాం. ఓ టీవీ చానల్‌ ఏకంగా 45 నిమిషాల పాటు చర్చా కార్యక్రమమే నిర్వహించింది. మేజిస్ట్రేట్‌లపై అడ్మినిస్ట్రేటివ్‌ కమిటీ చర్యలకు ఉపక్రమించిందని ఆ పత్రిక రాసింది. దీన్ని బట్టి ఆ పత్రిక, టీవీ ఛానెల్‌ వద్ద అన్నీ వివరాలు ఉన్నట్లున్నాయి” అని గ‌ట్టిగా వాదించారు.

కేసులు, వాటి ప‌ర్య‌వ‌సానాల గురించి కాల‌మే తేలుస్తుంది. కానీ ఏజీ వాద‌న విన్న వారెవ‌రికైనా ఎలాంటి అభిప్రాయం క‌లుగుతుంది? ఇప్పుడిదే ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఇప్ప‌టికే ఈ వ్య‌వ‌హారంపై ర‌క‌ర‌కాల వేదిక‌ల మీదుగా భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కానీ టీడీపీ అనుకూల మీడియాకు ఒక రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌లో ర‌హ‌స్యంగా ఉండాల్సిన అంశాలు ఎలా చేరాయి? అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

దీనికి గ‌ల కార‌ణాల‌పై త‌మ‌త‌మ సృజ‌నాత్మ‌క శ‌క్తిని బ‌ట్టి నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏమైనా రాస్తే, మాట్లాడితే ధిక్క‌ర‌ణ అనో, మ‌రొక‌టనో పేరు పెట్టి నోళ్లు క‌ట్టేస్తారు. కానీ ఒక నెగెటివ్ అభిప్రాయం ఏర్ప‌డ‌టానికి దారి తీసే ప‌రిస్థితుల‌పై రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌లు ఆత్మ ప‌రిశోధ‌న చేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని ఏజీ వాద‌న విన్న తర్వాత ఎవ‌రికైనా చెప్పాల‌నిపిస్తుంది.