జగన్ సర్కార్ పై టిడిపి మీడియా కొత్త కుట్ర?

న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎపిలో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న తెలుగుదేశం పార్టీ కాని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా కాని మరో అడుగు ముందుకు…

న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎపిలో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న తెలుగుదేశం పార్టీ కాని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా కాని మరో అడుగు ముందుకు వేస్తున్నట్లుగా ఉంది. 

జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నట్లు అనుమానంగా ఉంది. న్యాయదేవతపై నిఘా అంటూ టిడిపి మీడియా ఇచ్చిన కదనం చదివితే ఎలాగొలా జగన్ ప్రభుత్వాన్ని ఏదో ఒక కేసులో ఇరికించి పడగొట్టాలన్న తాపత్రయం కనబడుతోంది.

న్యాయ వ్యవస్థకు, జగన్ ప్రభుత్వానికి మద్య బాగా అంతరం పెంచడమే లక్ష్యంగా ఆ కధనం కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా అదే పనిలో ఉన్న ఈ మీడియా ఇప్పుడు ఆ కుట్రను మరింత తీవ్రం చేసినట్లుగా ఉంది. కనుక జగన్ సర్కార్ అప్రమత్తం కావల్సిన సమయం ఆసన్నమైంది.

కోర్టులలో వ్యతిరేక తీర్పులా?లేక అనుకూల తీర్పులా ?అన్న విషయం పక్కనబిడితే, ప్రజలలో గెలవలేమని అర్దం చేసుకున్న టిడిపి కాని, టిడిపి మీడియా కాని ఈ కుట్రలకు పాల్పడుతోందా అన్న సంశయం పలువురికి కలుగుతోంది.

ప్రయత్నం మంచిదే.. ప్రయాణమే