కలక్షన్ కింగ్ మోహన్ బాబు నటన మీద కానీ, వాచకం మీద కానీ వంక లేదు. కానీ తన వయసు తగిన పాత్రలు పట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. ఆ మధ్య ఆర్జీవీ తో ఓ సినిమా ట్రయ్ చేసారు కానీ ఫలితం దక్కలేదు. ఇప్పుడు కాస్త గ్యాప్ తరువాత తన వయసుకు తగిన పాత్రతో, తనకు తగిన కథతో సినిమా చేయబోతున్నారు.
బోయపాటి తదితర డైరక్టర్ల దగ్గర డైలాగ్ రైటర్ గా పేరు పడిన డైమండ్ రత్నంబాబు ఓ కథను తయారుచేసి మోహన్ బాబుకు వినిపించడం, ఆయన ఓకె చేయడం, ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రకటించడం కూడా జరిగిపోయింది. సినిమా టైటిల్ సన్ ఆఫ్ ఇండియా. చాలా కాలం తరువాత మోహన్ బాబు నటవిశ్వరూపం ప్రదర్శించే కథ ఇది అని డైమండ్ రత్నంబాబు కాస్త గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆయనే డైరక్షన్ కూడా చేస్తున్నారు.
కథ, కథనం సంగతులు ఎలా వున్నా, ఈ వయసులో కుర్ర అమ్మాయిలతో డ్యూయట్లు, సరసాలు లాంటివి దూరంగా వుంచితే బెటర్. ఏ వయసు కు దగ్గ పాత్ర ఆ వయసులో వేస్తే, మోహన్ బాబుకు అభిమానుల ఆదరణకు తక్కువేమీ వుండదు.
Announcing 'SON OF INDIA'#SonofIndia#sonofindiatitleposter#HappyIndependenceDay pic.twitter.com/9K5R20EsEs
— Mohan Babu M (@themohanbabu) August 15, 2020