ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఐఏఎస్ అధికారి పచ్చ బ్యాచ్ జీర్ణించుకోలేకుంది. జగన్‌తో భేటీకి వక్రభాష్యాలు, కులం కోణాలు తీస్తూ చెత్తరాతలు రాయడం ఎల్లో బ్యాచ్‌కే చెల్లింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రెండోరోజు ఆయన పర్యటన కొనసాగుతోంది. కేంద్ర పెద్దలతో భేటీ అవుతూ రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎంను ఆయన నివాసంలో పీఎం కార్యాలయ డిప్యూటీ సెక్రటరీ కాటా ఆమ్రపాలి కలుసుకున్నారు. గతంలో ఆమె తెలంగాణలో కలెక్టర్‌గా పని చేసి ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. విశాఖకు చెందిన ఆమ్రపాలి జమ్ము కాశ్మీర్ యువకుడిని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే.
జగన్‌తో ఆమ్రపాలి భేటీ కావడంపై ఎల్లో మీడియా పచ్చ అద్దాలతో చూస్తూ, తనవైన వక్రరాతలను వండి వారుస్తోంది. పీఎం కార్యాలయ అధికారులెవరూ ఇలా బయటికొచ్చి సీఎంలను కలవరని, అసలు ఇలాంటివేవీ ప్రధాని మోడీకి ఇష్టం లేదని తెగ బాధపడుతోంది పచ్చబ్యాచ్.
పీఎంకు కోపం తెప్పించే పనులు ఆయన కార్యాలయంలో పని చేసే అధికారి ఎవరైనా చేస్తారా? ఆ మాత్రం తెలియకుండానే సీఎం జగన్‌ను ఆమ్రపాలి కలుసుకుంటారా? సీఎం సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి కావడం వల్లే జగన్‌ను ఆమ్రపాలి కలుసుకున్నారనే వాదనను తెరపైకి తేవడం గమనార్హం. ఇలాగైతే సీఎం కలిసే వాళ్లంతా ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్లో ఆమ్రపాలి భేటీని విమర్శించే వారు చెబితే బాగుంటుందని అధికార పార్టీ కౌంటర్ ఇస్తోంది.