ముట్ట‌డి, దండ‌యాత్ర మ‌ధ్య ఎల్లో మీడియా

ఎల్లో మీడియా గిమ్మిక్కులు అన్నీఇన్నీ కావు. న‌చ్చ‌ని పాల‌కులపై విష‌పు రాత‌లు ఎప్ప‌టిక‌ప్పుడు క‌ళ్ల‌కు క‌డుతున్నారు. ఇదే త‌మ‌కు ఇష్ట‌మైన లేదా భ‌య‌పెట్టే పాల‌కులుంటే మాత్రం రాతలు అదుపులో ఉంటాయి.  Advertisement తాజాగా కొట్టొచ్చిన‌ట్టు…

ఎల్లో మీడియా గిమ్మిక్కులు అన్నీఇన్నీ కావు. న‌చ్చ‌ని పాల‌కులపై విష‌పు రాత‌లు ఎప్ప‌టిక‌ప్పుడు క‌ళ్ల‌కు క‌డుతున్నారు. ఇదే త‌మ‌కు ఇష్ట‌మైన లేదా భ‌య‌పెట్టే పాల‌కులుంటే మాత్రం రాతలు అదుపులో ఉంటాయి. 

తాజాగా కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించే తేడా గురించి తెలుసుకుందాం. ఇటీవ‌ల ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో పాటు మంత్రుల‌పై మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత అయ్య‌న్న‌పాత్రుడు అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు.

అయ్య‌న్న‌పాత్రుడి వ్యాఖ్య‌ల వెనుక మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబునాయుడు ఉన్నార‌ని ఆరోపిస్తూ వైసీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేశ్ నేతృత్వంలో నిర‌స‌న తెలిపేందుకు టీడీపీ అధినేత ఇంటి వ‌ద్ద‌కు వెళ్లారు. ఇది చంద్ర‌బాబునాయుడి ఇంటిపై దాడి, దండ‌యాత్ర‌గా ఎల్లో మీడియా చిత్రీక‌రించింది. 

వైసీపీ ప్ర‌భుత్వం దాదాగిరిపై రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తాయ‌ని ఎల్లో మీడియా త‌న‌దైన స్టైల్‌లో ఆవిష్క‌రించింది. ఇంత వ‌ర‌కూ బాగా ఉంది.

తాజాగా తెలంగాణ‌లో పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి ఇంటిపైకి ఆ రాష్ట్ర అధికార పార్టీ శ్రేణులు దాడికి వెళ్లాయి. ఈ ఘ‌ట‌న‌ను ఎల్లో మీడియా చిత్రీక‌రించిన తీరు గురించి త‌ప్ప‌క తెలుసుకోవాలి.

“జుబ్లీహిల్స్‌లోని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలకు నిరసనగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు రేవంత్‌ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు” అని ఎల్లో మీడియా రాత సాగింది.

రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య  డ్రగ్స్ వార్ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. రేవంత్‌పై కేటీఆర్ పరువు నష్టం కేసు వేశారు. రేవంత్ వ్యాఖ్యల‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు మండిప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో త‌మ ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు నేరుగా రేవంత్‌రెడ్డి ఇంటి ముట్ట‌డికే పిలుపునిచ్చారు.

ఏపీ, తెలంగాణ‌ల‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌ల ఇళ్ల ఎదుట అధికార పార్టీ నేతృత్వంలో చేప‌ట్టిన నిర‌స‌న‌ను రెండు ర‌కాలుగా ఎల్లో మీడియా చిత్రీక‌రించ‌డాన్ని చూడొచ్చు. జ‌గ‌న్‌ను దూషించడాన్ని నిర‌సిస్తూ ఆయ‌న అభిమానులు ఆందోళ‌న‌కు దిగితే అది దండ‌యాత్ర అయింది. 

అదే తెలంగాణ‌లో టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు చేస్తే మాత్రం ముట్ట‌డిగా చూప‌డాన్ని గ‌మ‌నించొచ్చు. జ‌గ‌న్ అభిమానులు చేస్తే దండ‌యాత్ర‌, టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు అదే ప‌నికి దిగితే ముట్ట‌డిగా చిత్రీక‌రించే ఎల్లో విష‌పు రాత‌ల గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే.