విమ్స్ ని చూస్తే వైఎస్సార్ గుర్తుకొస్తారు!

వైఎస్సార్ కి ఏం పాలన తెలుసు అన్న వారు నోళ్ళు వెళ్లబెట్టేలా ఆయన అద్భుతమైన పాలన అందించారు. అది ఈనాడు దేశానికి ఒక రోల్ మోడల్ అని కూడా చెప్పాలి. సంక్షేమాన్ని సంత్రుప్తకర స్థాయి…

వైఎస్సార్ కి ఏం పాలన తెలుసు అన్న వారు నోళ్ళు వెళ్లబెట్టేలా ఆయన అద్భుతమైన పాలన అందించారు. అది ఈనాడు దేశానికి ఒక రోల్ మోడల్ అని కూడా చెప్పాలి. సంక్షేమాన్ని సంత్రుప్తకర స్థాయి దాకా తీసుకెళ్ళిన ఘనత వైఎస్సార్ దే. అంతే కాదు అభివ్రుద్ధిని దానికి జోడించి ఒక పాలకుడికి రెండు కళ్ళు ఏంటో ఆచరణలో చూపించిన దార్శనికుడు వైఎస్సారని చెప్పకతప్పదు.

ప్రగతి అంతా హైదరాబాద్ కే పరిమితం అయిన వేళ అత్యాధునిక ఆసుపత్రి విశాఖకు ఉండాలని గట్టిగా  ఆలోచించిన వారు వైఎస్సార్. అందుకే ఆయన హయాంలో విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విమ్స్  కి శ్రీకారం చుట్టారు. ఓ విధంగా దూరద్రుష్టిలో కూడా చేశారు అనుకోవాలి.

విభజన ఎపుడైనా జరిగితే ఈ ప్రాంతాలకు ఒక ఉత్తమ వైద్య సదుపాయం లభిస్తుందన్నది కూడా వైఎస్సార్  ఆలోచనగా కూడా కావచ్చు. ఇక విభజన తరువాత అయిదేళ్ల పాటు పాలించిన చంద్రబాబు విమ్స్ అబివ్రుధ్ధిని పూర్తిగా పక్కన పెట్టేశారు. మళ్ళీ జగన్ సీఎం అయ్యాకే  విమ్స్  కి ఊపిరి వచ్చింది.

విమ్స్  ని వైఎస్సార్ కలలకు తగినట్లుగా 500 పడకలతో అద్భుతమైన ఆసుపత్రిగా తయారు చేస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెబుతున్నారు. నిజంగా జగన్ ఆ పని చేస్తారని విశాఖ జనం నమ్ముతున్నారు. ఏది ఏమైనా తాను లేకపోయినా తన అభివ్రుధ్ధి  ఆనవాళ్ళు ఎన్నో కళ్ళ ముందుంచిన వైఎస్ నిజమైన ప్రజానేత అని కీర్తించాల్సిందే.

రైటింగ్ లో భలే మజా వస్తుంది

ఇడుపులపాయలో జగన్