అందరి చూపులు ఇండియన్ 2 మీదే!

ఇండియన్ 2 తెలుగులో భారతీయుడు 2. ఇప్పుడు ఈ సినిమా మీద అందరి దృష్టి వుంది. కమల్ హాసన్ సినిమా అనో, భారతీయుడు సీక్వెల్ అనో, భారీ సినిమా అనో కాదు. కేవలం దర్శకుడు…

ఇండియన్ 2 తెలుగులో భారతీయుడు 2. ఇప్పుడు ఈ సినిమా మీద అందరి దృష్టి వుంది. కమల్ హాసన్ సినిమా అనో, భారతీయుడు సీక్వెల్ అనో, భారీ సినిమా అనో కాదు. కేవలం దర్శకుడు శంకర్ సినిమా అనే ఆ ఆసక్తి అంతా.

అది కూడా ఎందుకంటే అదే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ రెడీ అవుతోంది కనుక. గేమ్ ఛేంజర్ సినిమా చిరకాలంగా షూటింగ్ లోనే వుంది. ఇప్పటికి కూడా ఇంకా మరో ఇరవై రోజులు వర్క్ వుంది.

గేమ్ ఛేంజర్ భారీ సినిమా. రామ్ చరణ్ కు ఆర్ఆర్ఆర్ తరువాత వస్తున్న పాన్ ఇండియా సినిమా. ఈ సినిమా ఎలా వుంటుంది అన్నది మెగా ఫ్యాన్స్ కు వున్న టెన్షన్. చిరకాలంగా ఈ సినిమా కోసం ఆతృతగా వేచి చూస్తున్నారు. శంకర్ కు ట్రాక్ రికార్డ్ ఏమంత సరిగా లేదు. సరైన హిట్ అన్నది పడి చాలా కాలం అయింది. అందువల్ల శంకర్ టేకింగ్ ఎలా వుంది అన్నది ఇంకా క్లారిటీ లేదు.

ఇండియన్ 2 ట్రయిలర్ అయితే ఏమంత అద్భుతం అనిపించలేదు. అందువల్ల సినిమా ఎలా వుంటుందో అన్న టెన్షన్ వుంది. ఈ సినిమా చూసిన తరువాత గేమ్ ఛేంజర్ మీద అంచనాలు వస్తాయి. అంతే కాదు ఇండియన్ 2 హిట్ అయితే ఆ ప్రభావం గేమ్ ఛేంజర్ మార్కెట్ మీద వుంటుంది. ఇండియన్ 2 కనుక హిట్ అయితే గేమ్ ఛేంజర్ వెనుక పడతారు బయ్యర్లు. ఇండియన్ 2 కనుక ఆశించిన మేరకు లేకపోతే ఆ ప్రభావం కచ్చితంగా గేమ్ ఛేంజర్ మీద పడుతుంది.

అందుకే అటు ఇండస్ట్రీ వర్గాలు, ఇటు మెగా ఫ్యాన్స్ అంతా ఇండియన్ 2 మీదే వుంది.