భారతీయుడు…ఇరవై నిమషాలు కట్

అనుభవం అయితే తప్ప తత్వం బోధపడదు. దర్శకుడు శంకర్ ఇటీవల హైదరాబాద్ వచ్చినపుడు మీడియాతో మాట్లాడుతూ ఓ విషయం చెప్పారు. సినిమా అంతా తీసాక, ఏ ఒక్క సీన్ కూడా కట్ చేయాలని అనిపించలేదట.…

అనుభవం అయితే తప్ప తత్వం బోధపడదు. దర్శకుడు శంకర్ ఇటీవల హైదరాబాద్ వచ్చినపుడు మీడియాతో మాట్లాడుతూ ఓ విషయం చెప్పారు. సినిమా అంతా తీసాక, ఏ ఒక్క సీన్ కూడా కట్ చేయాలని అనిపించలేదట. ప్రతి సీన్ సినిమాకు అవసరం అని క్లారిటీ వచ్చాక, రెండు భాగాలు చేయాలి, భారతీయుడు 3 కూడా చేయాలని డిసైడ్ అయ్యారట.

తీరా. .సినిమా విడుదలయ్యాక, మూడు గంటల నిడివిలో బోరింగ్ సీన్లు లేదా సాగదీత సీన్లు చూసాక జనం హాహా కారాలు చేసారు. ఇదెక్కడి సినిమా అనుకున్నారు. సినిమాలో చెప్పదలుచుకున్న పాయింట్ బాగున్నా, ఈ సాగదీత సీన్లు జనాలకు థియేటర్ కు అడ్డంగా నిలబడ్డాయి. దాంతో ఇప్పుడు దర్శకుడు శంకర్ కు తత్వం బోధపడినట్లుంది.

సినిమా మూడు గంటల నిడివిలోంచి ఇరవై నిమిషాలు లేపేసారు. ఎక్కడ లేపారు. ఏం లేపారు అనేది మరోసారి చూస్తే తెలుస్తుంది. మొత్తానికి సినిమా నిడివి తగ్గింది కనుక ప్రేక్షకులు థియేటర్ బాట పట్టి, ఎంజాయ్ చేస్తారేమో?