మహేష్ కొడుకుకు అమెరికాలో నట శిక్షణ

ఘట్టమనేని మూడో తరం వారసుడిగా మహేష్ తనయుడు గౌతమ్ తెర మీదకు రావాల్సి వుంది. అయితే దానికి ఇంకా మరో అయిదారేళ్ల సమయం వుంది. ప్రస్తుతం ప్లస్ 2 పూర్తయింది. బ్యాచులర్స్ చేయాలి. ఈ…

ఘట్టమనేని మూడో తరం వారసుడిగా మహేష్ తనయుడు గౌతమ్ తెర మీదకు రావాల్సి వుంది. అయితే దానికి ఇంకా మరో అయిదారేళ్ల సమయం వుంది. ప్రస్తుతం ప్లస్ 2 పూర్తయింది. బ్యాచులర్స్ చేయాలి. ఈ మేరకు అమెరికాలో బ్యాచులర్ డిగ్రీ కోర్స్ లో జాయిన్ కాబోతున్నాడు గౌతమ్ అని తెలుస్తోంది. అయితే అమెరికాలో వుంటూ కేవలం బ్యాచులర్ డిగ్రీ చేస్తే ఎలా?

ఎప్పటికైనా కెమేరాను ఫేస్ చేయాలి కదా. అందుకే న్యూయార్క్ లోని ప్రఖ్యాత ఫిలిం శిక్షణ సంస్థలో గౌతమ్ ను జాయిన్ చేయబోతున్నారని తెలుస్తోంది. డిగ్రీతో పాటు సమాంతరంగా నట శిక్షణ పొంది తిరిగి వస్తారన్నమాట. ఎలా లేదన్నా నాలుగైదు ఏళ్లు పడుతుంది ఇంతా జరిగేసరికి. అప్పుడు పాతికేళ్లకు దగ్గర పడతాడు గౌతమ్. సినిమా ఎంట్రీకి పెర్ ఫెక్ట్ టైమ్.

ఇదిలా వుంటే మహేష్ తనయ సితార కూడా సినిమాల్లో నటించడం అంటే చాలా ఇష్టం అని తెలుస్తోంది. మరి ఆమెను సినిమాల్లోకి తెస్తారా? అన్నది తెలియాల్సి వుంది. కానీ దానికి కూడా ఇంకా మరో ఆరేడేళ్ల సమయం వుంది. మొత్తానికి టాలీవుడ్ లో ఘట్టమనేని మూడో తరం రావడం మాత్రం ఫిక్స్.