తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినిమా జనాలను ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం సినిమా జనాలు కలిసి రావడం లేదని ఆయన నిర్మొహమాటంగా చెప్పారు. అందువల్ల ఇక నుంచి సినిమా జనాలను కూడా యాంటీ డ్రగ్స్ మూవ్ మెంట్ లో భాగస్వాములను చేసేందుకు ఓ మంచి ఐడియా వేసారు. దాన్నే ఓపెన్ గా ప్రకటించారు.
ఇకపై పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు కావాలని ఎవరు వచ్చినా, ముందుగా ఆ సినిమా జనాలు, ముఖ్యంగా ఆ సినిమా హీరో, ఇతర నటులతో ఓ షార్ట్ ఫిల్మ్ లేదా రెండు నిమిషాల వీడియో లాంటిది చేసి అందించాల్సి వుంటుందన్నారు. డ్రగ్స్ దుష్ప్రభావం మీద కాన్సెప్ట్ వీడియోలు చేసి ఇవ్వాలన్న మాట.
సాధారణంగా టికెట్ రేట్ల కోసం వచ్చేవి భారీ సినిమాలే. అంటే పెద్ద హీరోలు, దర్శకులు పని చేసేవే. అందువల్ల ఆ రేంజ్ హీరోలు, దర్శకులు కనుక డ్రగ్స్ దుష్ప్రభావం మీద వీడియోలు చేస్తే యువత మీద కచ్చితంగా పని చేస్తాయి. డ్రగ్స్ కు కొంతమంది అయినా దూరం అయ్యే అవకాశం కచ్చితంగా వుంటుంది.
మొత్తం మీద తెలంగాణ సీఎం రేవంత్ మంచి ఆలోచనే చేసారు. ఆంధ్రలో కూడా ఇలాగే అడిగితే బాగుంటుంది.