మిడ్ రేంజ్ హీరోల్లో విష్వక్ సేన్ ఇప్పుడు ఫుల్ స్పీడ్ లో వున్నారు. మూడు సినిమాలను వరుసగా చేస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మంచి అప్లాజ్ ను ఇచ్చింది. ఆ తరువాత రామ్ తాళ్లూరి నిర్మాతగా మెకానిక్ రాఖీ సినిమా చేస్తున్నారు. అది దాదాపు పూర్తయింది. త్వరలో విడుదల దిశగా వెళ్తోంది. ఈ లోగా మరో రెండు సినిమాలు ఒకే చేసేసాడు.
లేడీ గెటప్ లో కూడా కనిపించే లైలా సినిమా ప్రారంభమయింది. సాహు గారపాటి నిర్మాత. ఈ సినిమా కథ డిఫరెంట్ గా వుంటుందని తెలుస్తొంది. రామ్ నారాయణ్ ఈ సినిమాకు దర్శకుడు.
ఇదిలా వుంటే అనుదీప్ దర్శకత్వంలో మరో సినిమాకు ఎస్ చెప్పినట్లు తెలుస్తోంది. చాలా కాలంగా అనుదీప్ ఓ సినిమా కోసం వేచి వున్నాడు. సితార సంస్థలో నవీన్ పోలిశెట్టి లేదా రవితేజ అనుకున్నారు. కానీ ఆ రెండూ ఇంకా సెట్ కాలేదు.
ఈ లోగా 14 రీల్స్ సంస్థకు లేదా మరో సంస్థకు విష్వక్ సేన్ హీరోగా అనుదీప్ సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ జానర్ దిశగా విష్వక్ సేన్ వెళ్తున్నట్లు కనిపిస్తోంది. లైలా సినిమా కానీ అనుదీప్ సినిమా కానీ రెండూ పక్కా ఎంటర్ టైన్ మెంట్ సినిమాలే.
మెకానిక్ రాఖీ మాత్రం మాస్ యాక్షన్ సినిమా అని తెలుస్తోంది. ఇవి కాక సుధాకర్ చెరుకూరి నిర్మాతగా కూడా విష్వక్ ఓ సినిమా చేస్తారని తెలుస్తోంది.