గేమ్ ఛేంజర్ మీదే డిస్కషన్ అంతా!

భారతీయుడు 2 సినిమా వచ్చింది. ఎక్కువ నెగిటివ్ టాక్, కాస్త తక్కువగా మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఆంధ్రలో అయితే సాయంత్రానికి కలెక్షన్లు జారిపోయాయి. అది వేరే సంగతి. కానీ ఇప్పుడు జనం అంతా…

భారతీయుడు 2 సినిమా వచ్చింది. ఎక్కువ నెగిటివ్ టాక్, కాస్త తక్కువగా మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఆంధ్రలో అయితే సాయంత్రానికి కలెక్షన్లు జారిపోయాయి. అది వేరే సంగతి. కానీ ఇప్పుడు జనం అంతా భారతీయుడు 2 గురించి కాకుండా గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడుతున్నారు.

ఎందుకంటే ఇండియన్ 2 కన్నా ముందుగా మొదలుపెట్టిన సినిమా గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ హీరో, ఈ సినిమా ఎప్పటి నుంచో నిర్మాణంలో వుంది. ఈ ఏడాది విడుదల అవుతుందని ఆశిస్తున్నారంతా. 

భారతీయుడు 2 సినిమా ఫ్లాప్ గా మిగిలిన నేఫథ్యంలో గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏమిటి? ఆ సినిమా కథ ఎలా వుంటుంది. కథనం ఎలా వుండి వుంటుంది? శంకర్ ఎలా తీసి వుంటారు? ఇదే డిస్కషన్. శంకర్ చిరకాలంగా స్క్రిప్ట్ విషయంలోనే బాధపడుతున్నారు. గేమ్ ఛేంజర్ కథ శంకర్ ది కాదు. అందువల్ల అది పెద్ద రిలీఫ్. క్రాఫ్ట్ విషయంలో శంకర్ అప్ డేట్ గానే వున్నారు కనుక, కథ సరైనది అయితే సినిమా బాగానే వుంటుంది అని ధీమా పడుతున్నారు ఫ్యాన్స్.

అయితే ఇక్కడ ఇంకో సమస్య వుంది. మంచి కథ అయి వుండి, శంకర్ బాగా తీసి వుంటే గేమ్ ఛేంజర్ కు ఢోకా లేదు. కానీ అది అంతా సినిమా విడుదల అయిన తరువాత సంగతి. ముందుగా సినిమాను సరైన రేట్లకు మార్కెట్ చేయాలి. అది పెద్ద సమస్య. గేమ్ ఛేంజర్ బడ్జెట్ ప్రకారం చూసుకుంటే మంచి రేట్లకు అమ్మాల్సి వుంటుంది. నైజాం, వైజాగ్ ఏరియాలు స్వంతంగా విడుదల చేసుకుంటారు. కానీ మిగలిన ఏరియాల్లో రేట్లు రావాలి. ముఖ్యంగా హీందీలో మంచి ఓపెనింగ్ రావాలి. 

ఇవన్నీ ఇలా వుంచితే గేమ్ ఛేంజర్ మరో ఇరవై రోజుల వరకు షూట్ వుంది. దర్శకుడు శంకర్ భారతీయుడు 2 షాక్ నుంచి తేరుకుని సెట్ మీదకు రావాల్సి వుంది. వెంటనే వస్తే ఓకె. లేదా ఓ నెల రోజులు టైమ్ తీసుకుంటే మాత్రం సినిమా విడుదలకు సమస్య అవుతుంది. ఎందుకంటే సినిమాను దీపావళికి కానీ డిసెంబర్ లో కానీ విడుదల చేయాల్సి వుంది. 

మొత్తం ఇండియన్ ప్రాజెక్ట్ వచ్చి గేమ్ ఛేంజర్ ను డిలే చేయడమే కాదు, నీరసింపచేసింది అనుకోవాల్సిందే.