గేమ్ ఛేంజర్.. చరణ్ పాత్ర పూర్తి

రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్ లో నిర్మాణమవుతున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమా చాలా అంటే చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటూనే వుంది. ఇండియన్ 2 సినిమా కూడా టేకప్ చేయాల్సిన పరిస్థితి…

రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్ లో నిర్మాణమవుతున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమా చాలా అంటే చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటూనే వుంది. ఇండియన్ 2 సినిమా కూడా టేకప్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడడంతో దర్శకుడు శంకర్ అటో కాలు, ఇటో కాలు వేసి షూట్ చేసుకుంటూ వచ్చారు.

ఈ ఏడాది ఎలాగైనా విడుదల చేయాలన్నది నిర్మాత సంకల్పం. కానీ ఇంకా మరో ఇరవై రోజుల షూట్ వర్క్ వుంది. అయితే సినిమాలో రామ్ చరణ్ పాత్ర వర్క్ మాత్రం ఈ రోజుతో పూర్తయింది. ఇక డబ్బింగ్, సినిమా ప్రమోషన్ తప్ప రామ్ చరణ్ కు గేమ్ ఛేంజర్ తో పెద్దగా వర్క్ లేదు.

దర్శకుడు బుచ్చిబాబు చిరకాలంగా వెయిటింగ్ లో వున్నారు. రామ్ చరణ్ చేయబోయే తరువాత సినిమా దర్శకుడు బుచ్చిబాబునే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తయింది. స్క్రిప్ట్ రెడీగా వుంది. రెండు మూడు పాటలు కూడా రెడీ అయ్యాయి.

ఇక చరణ్ డేట్ లు ఇస్తే ఆ సినిమా చకచకా ముందుకు సాగుతుంది. గేమ్ ఛేంజర్ కూడా ఇక మిగిలిన ఇరవై రోజుల షూట్ ఈ నెలలో పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రోడక్షన్ కు వెళ్తుంది. సిజి వర్క్ ముందే పూర్తయినందున, దర్శకుడు అనుకుంటే కనుక దీపావళికి విడుదల వుండొచ్చు. కాదు అంటే డిసెంబర్ కు వెళ్తుంది. మొత్తానికి ఈ ఏడాదే తెరమీదకు వస్తుంది గేమ్ ఛేంజర్.