మూడు సినిమాలు.. మూడు బేరాలు

డబుల్ ఇస్మార్ట్.. మిస్టర్ బచ్చన్.. డార్లింగ్. ఈ మూడు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. కానీ మూడు సినిమాలకు ఇంకా వివిధ హక్కులు అమ్ముడు కావాల్సి వుంది. Advertisement డబుల్ ఇస్మార్ట్ డిజిటర్ రైట్స్…

డబుల్ ఇస్మార్ట్.. మిస్టర్ బచ్చన్.. డార్లింగ్. ఈ మూడు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. కానీ మూడు సినిమాలకు ఇంకా వివిధ హక్కులు అమ్ముడు కావాల్సి వుంది.

డబుల్ ఇస్మార్ట్ డిజిటర్ రైట్స్ మీద డిస్కషన్లు సాగుతున్నాయి. నిర్మాత ఛార్మి ఇప్పుడు ఆ పని మీదే బిజీగా వున్నారు. అది పూర్తయితే థియేటర్ హక్కుల సంగతి తేలాల్సి వుంటుంది. ఈ సినిమాను ఆగస్ట్ 15న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించిన రవితేజ మిస్టర్ బచ్చన్ కూడా నాన్ థియేటర్ హక్కుల డిస్కషన్లు రెండు డిజిటల్ ఫ్లాట్ పారమ్స్ తో సాగుతున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు కోట్ల దగ్గర ముందు వెనుక బేరాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. అవి పూర్తయితే విడుదల డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. ప్రస్తుతానికి ఆగస్ట్ 15 లేదా దసరా కు అనే ఆలోచనలో వున్నారు మేకర్లు. మరోపక్క ఇదే సినిమా థియేటర్ హక్కుల బేరాలు కూడా జరుగుతున్నాయి. ఆసియన్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు తీసుకునే అవకాశం వుంది.

ప్రైమ్ షో నిర్మించిన మీడియం సినిమా డార్లింగ్. నభా నటేష్- ప్రియదర్శి హీరో హీరోయిన్లు. ఈ సినిమా నాన్ థియేటర్ హక్కుల బిజినెస్ జరిగింది. థియేటర్ బిజినెస్ జరగాల్సి వుంది. డిస్కషన్లు జరుగుతున్నాయి. ఒకవేళ కాకపోతే స్వంతంగా విడుదల చేసుకునే దిశగా మేకర్లు వున్నారు.