ఒకప్పుడు నైజాంలో కొత్త బయ్యర్ వస్తే బతకడం కష్టం. థియేటర్లు అందకుండా చేసి చంపేయడం జరిగేది. వరంగల్ శ్రీను లాంటి వాళ్లకు అదృష్టం కూడా కలిసి రాక ఇరుకున పడిపోయాడు. మరి ఇక ఎవ్వరూ నైజాంలో ఎదగడం కష్టం అని అంతా డిసైడ్ అయిపోయారు. నైజాంలో సినిమాలు కొనరు అని అనుకున్నారు.
కానీ ఇప్పుడు మళ్లీ ట్రెండ్ మారింది. నైజాంలో ఇప్పుడు సినిమాలు కొనే పరిస్థితి వచ్చింది. దిల్ రాజు సంస్థతో పాటు, ఆసియన్ సురేష్, గ్లోబల్ సినిమాస్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్, ఇంకా ఇండివిడ్యువల్ బయ్యర్లు రంగంలోకి దిగారు. సినిమాలు కొనడానికి ఆఫర్లు ఇస్తున్నారు. మైత్రీ సంస్థ దూకుడు చూసిన తరువాత సినిమాలు కొనడానికి ఇష్టపడని ఆసియన్- సురేష్ లాంటి వాళ్లు సినిమాలు కొంటున్నారు.
ఎగ్జిబిటర్లను గ్రిప్ లో వుంచుకున్న వారు ఇప్పుడు మైత్రీ దూకుడు చూసి మనసు మార్చుకుంటున్నారు. ఎవరి దగ్గర ఎక్కువ సినిమాలు వుంటే వారి వైపే ఎగ్జిబిటర్లు వుంటారు. అందుకే చిన్న సినిమాలు అయినా ఎంతో కొంత ఇచ్చి కొనే ప్రయత్నం చేస్తున్నారు.
మొత్తం మీద ఇప్పుడు నైజాంలో ట్రెండ్ మారుతోంది. మళ్లీ పంపిణీ రంగం మారుతోంది. నిర్మాతలకు మంచి జరిగేలా వుంది.