భారతీయుడు-3.. ఈసారి ఫుల్ లెంగ్త్

భారతీయుడు-2 సినిమాలో సిద్దార్థ్ కనిపించాడు. ఆ తర్వాత కమల్ హాసన్ వచ్చారు. కానీ భారతీయుడు-3లో మాత్రం అలా కాదు, కమల్ హాసన్ ఫుల్ లెంగ్త్ కనిపించబోతున్నారు. పార్ట్-2 చివర్లో వేసిన ట్రయిలర్ ఈ విషయాన్ని…

భారతీయుడు-2 సినిమాలో సిద్దార్థ్ కనిపించాడు. ఆ తర్వాత కమల్ హాసన్ వచ్చారు. కానీ భారతీయుడు-3లో మాత్రం అలా కాదు, కమల్ హాసన్ ఫుల్ లెంగ్త్ కనిపించబోతున్నారు. పార్ట్-2 చివర్లో వేసిన ట్రయిలర్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

పార్ట్-3లో అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో పాటు, ప్రస్తుతం భారతీయుడు ఏం చేశాడనే విషయాన్ని కూడా చూపించబోతున్నారు. ఇక ట్రయిలర్ లో కాజల్ ను కూడా యాక్షన్ లుక్ లో చూపించారు.

భారతీయుడు-2 ఎమోషనల్ గా ఆకట్టుకోలేకపోయింది. కానీ చివర్లో వచ్చిన పార్ట్-3 ట్రయిలర్ చూస్తే మాత్రం కాస్త మనసుకు పట్టేలా ఉండొచ్చనే భావన కలిగింది. అసలు పార్ట్-2, పార్ట్-3 కలిపి ఒకే సినిమాగా 3 గంటల నిడివితో విడుదల చేస్తే మరింత గ్రిప్పింగ్ గా ఉండేదని, ఇప్పుడు వినిపిస్తున్న మిక్స్ డ్ టాక్ కూడా వచ్చేది కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

భారతీయుడు-3 వచ్చే ఏడాది విడుదల కానుంది. సినిమాలో కమల్ హాసన్ కు జోడీగా కాజల్ నటించింది. ఆల్రెడీ షూటింగ్ పూర్తయింది. గేమ్ ఛేంజర్ రిలీజైన తర్వాత భారతీయుడు-3 వర్క్ స్టార్ట్ చేస్తాడు శంకర్.