మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అనే సినిమా ఎవరూ అంత సులవుగా మర్చిపోలేరు. ఆ సినిమా దర్శకుడు క్రాంతి మాధవ్ ను అంత సులువుగా మరిచిపోలేరు. గుండెలకు హత్తుకునే సినిమాను అందించాడు. కానీ ఆ తరువాత వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఫ్లాప్ కావడంతో క్రాంతి మాధవ్ మెగాఫోన్ కు దూరం అయ్యారు. మంచి దర్శకుడే కానీ మంచి సక్సెస్ కూడా కావాలి కదా.
ఇప్పుడు మళ్లీ టైమ్ వచ్చినట్లు కనిపిస్తోంది. రెండు మూడు సినిమాలు లైన్ లో పడేలా వుంది పరిస్థితి. నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో సాయి పల్లవి కీలకపాత్రలో ఓ సినిమా ప్లానింగ్ వరకు వచ్చింది. స్క్రిప్ట్ కొద్దిగా ఫైనల్ కావాల్సి వుంది. అది అయితే ఆ సినిమా సెట్ మీదకు వెళ్తుంది. ఎక్కువగా విదేశాల్లో షూట్ వుండే సినిమా ఇది.
ఇది కాకుండా హీరో నాగశౌర్యకు, క్రాంతి మాధవ్ తన స్టయిల్ కు భిన్నంగా ఓ మంచి యాక్షన్ సబ్జెక్ట్ నెరేట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి హీరో ఓకె అన్నారు. తరువాత వ్యవహారాలు వుంటాయి కదా.
మొత్తం మీద మళ్లీ టైమ్ వచ్చింది క్రాంతి మాధవ్ కు. ఒక్క హిట్ పడితే బండి ఫోర్త్ గేర్ లో దూసుకుపోతుంది.