ముంబాయి కనెక్షన్లు కీలకం

ఓ స్టేజ్ కు వెళ్లిన కొద్దీ సర్కిల్ అనేది కీలకంగా మారుతుంది. సర్కిల్ మేరకే పార్టీలు, ఆహ్వానాలు, ఫోకస్, కవరేజ్ ఇలా అన్నీ వుంటాయి. సెలబ్రిటీలకు ఈ సర్కిల్ అనేది చాలా కీలకం. ఈ…

ఓ స్టేజ్ కు వెళ్లిన కొద్దీ సర్కిల్ అనేది కీలకంగా మారుతుంది. సర్కిల్ మేరకే పార్టీలు, ఆహ్వానాలు, ఫోకస్, కవరేజ్ ఇలా అన్నీ వుంటాయి. సెలబ్రిటీలకు ఈ సర్కిల్ అనేది చాలా కీలకం. ఈ సర్కిల్ కోసమే సెలబ్రిటీలు పార్టీలు హోస్ట్ చేస్తుంటారు. పార్టీలకు వెళ్తుంటారు. అంబానీల ఇంట పెళ్లికి మన తెలుగు హీరోలు కొందరు వెళ్లారు. కొందరు వెళ్లలేదు. సింపుల్ ఆన్సర్. సర్కిల్. ముంబాయి.. బాలీవుడ్ సర్కిల్ వున్న వారు వెళ్లారు. లేని వాళ్లు వెళ్లలేదు. అతే.

రామ్ చరణ్ పెళ్లి ఉపాసనతో జరిగిన దగ్గర నుంచి వేరే కొత్త సర్కిల్ యాడ్ అయింది. హై ఫై బిజినెస్ సర్కిల్ అది. అపోలో సంస్థ భాగస్వామిగా ఉపాసనకు వున్న సర్కిల్ ఇప్పుడు రామ్ చరణ్ కు కూడా తోడయింది. అందుకే అంబానీల ఇంట పెళ్లికి ఆహ్వానం అందింది.

మహేష్ బాబు సతీమణి నమ్రత సర్కిల్ మొత్తం బాలీవుడ్ నే. అందువల్ల అంబానీల ఇంట పెళ్లికి ఆహ్వానం అందింది. ఆ పెళ్లిలో మహేష్, సితార తళుక్కున మెరిసారు.

రానా మొదటి నుంచి ముంబాయి సర్కిల్ ను విపరీతంగా మెయింటెయిన్ చేస్తూ వచ్చారు. రానా నాయుడుతో వెంకీ కూడా ముంబాయి బాలీవుడ్ సర్కిల్ లో ఎంటర్ అయిపోయారు. దాంతో వారి కూడా అంబానీల ఇంట పెళ్లికి ఆహ్వానం అందింది.

పవన్ కళ్యాణ్ ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి. అంతకు మించిన హోదా ఏముంది.. పిలవాల్సిందే. పిలిచారు.

ఎవరయ్యా ఈ బాలీవుడ్, ముంబాయి సర్కిల్ కు దూరంగా వుండిపోయింది అంటే ఎన్టీఆర్, అల్లు అర్జున్ మాత్రమే. వారు అక్కడ పరిచయమే. కానీ ఆ సర్కిల్ తో మమేకం అయిపోయి లేరు. అందుకే కావచ్చు ఫంక్షన్ కు దూరంగా వుండిపోయారు అనుకోవాలి. త్వరలో దేవర, పుష్ప 2 లు ఆ లోటు తీర్చేసే అవకాశం వుంది.