పాతిపెట్టిన డబ్బు వెలికితీసిన రష్మిక

అర్థరాత్రి, చేతిలో గునపంతో ఓ నిర్జన ప్రదేశానికి చేరుకుంది రష్మిక. తను అప్పటికే గుర్తించిన స్పాట్ కు చేరుకుంది. చేతిలో ఉన్న డబ్బా, మెడ నుంచి చున్నీ తీసి పక్కనపెట్టింది. గునపంతో తవ్వడం మొదలుపెట్టింది.…

అర్థరాత్రి, చేతిలో గునపంతో ఓ నిర్జన ప్రదేశానికి చేరుకుంది రష్మిక. తను అప్పటికే గుర్తించిన స్పాట్ కు చేరుకుంది. చేతిలో ఉన్న డబ్బా, మెడ నుంచి చున్నీ తీసి పక్కనపెట్టింది. గునపంతో తవ్వడం మొదలుపెట్టింది.

ఓ పెద్ద సూట్ కేసు బయటపడింది. దాన్ని అతి కష్టమ్మీద బయటకు లాగింది. ఓపెన్ చేసి చూస్తే, నిండా డబ్బు. వెంటనే ఆమె కళ్లు మెరిశాయి. ఆనందంతో దేవుడికి దణ్నం పెట్టుకుంది. సూట్ కేసు మూసేసి, దాన్ని లాక్కుంటూ ఆనందంతో వెళ్తోంది.

కుబేర సినిమాలో రష్మిక ఫస్ట్ లుక్ ను వివరిస్తూ మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ ఇది. ఇది మాత్రమే కాదు, ఇంతకుముందు విడుదల చేసిన వీడియోలు కూడా ఆకట్టుకున్నాయి. నాగార్జున లుక్ నే తీసుకుంటే, వేల కోట్ల డబ్బును సీజ్ చేసిన ఆనందంలో కనిపించిన నాగ్, ఓ నోటు వర్షానికి తడిస్తే, తన సొంత డబ్బు తీసి సీజ్ చేసిన డబ్బులో కలుపుతాడు.

వీటికంటే ముందు విడుదల చేసిన ధనుష్ లుక్ అయితే దాదాపు అందరికీ షాక్. శివపార్వతుల బ్యాక్ డ్రాప్ లో బిచ్చగాడి గెటప్ లో ధనుష్ ను చూపించి షాకిచ్చారు మేకర్స్.

ఇలా కుబేర సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదల చేసిన లుక్స్ అన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ లుక్స్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయో, వాటికి దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే బాగుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్-రష్మిక-నాగ్ కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్, ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.