Advertisement

Advertisement


Home > Articles - Chanakya

పవన్ కు రాజకీయం అబ్బేసింది

పవన్ కు రాజకీయం అబ్బేసింది

పిచ్చోడు అని ముద్ర మీద పడేసుకుంటే, కేసుల నుంచి తప్పించుకోవచ్చు అని వెనకటికి ఓ ఐడియా వినిపించేది. అదే విధంగా తిక్క, కన్ఫ్యూజన్ అన్న ముద్ర పడిపోతే తన మాటలు ఈజీగా తీసుకుంటారని అనుకుంటున్నారేమో పవన్ బాబు.  చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. అది ఒక్క తెలంగాణ విషయంలోనే. బాబు వైనం చూసాక తెలిసి వచ్చి వుంటుంది. రెండు కళ్లు, సమన్యాయం లాంటి మాటలు చెబితే చాలు, సీమాంధ్ర జనాలు గుడ్డిగా నమ్మేస్తారు. ఆహా..మన మనిషే అనుకుంటారు. లేఖ ఇచ్చాడా..మద్దతు ఇచ్చాడా అన్నది పట్టించుకోరు. అడి డిసైడ్ అయిపోయాడు. కానీ తెలంగాణ జనాలు అలా కాదు. తెలంగాణ ను వ్యతిరేకించిన వారిని ఇప్పటకీ గుర్తు పెట్టుకునే వున్నారు. అందుకే పవన్ జై తెలంగాణ అంటూ, మళ్లీ సీమాంధ్ర కోసం సమన్యాయం అనే సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. 

తన తొలి సమావేశం స్పీచ్ మరోసారి రివైండ్ చేసి వినండి..తెలుగుజాతిని చీల్చడం బాధేసిందన్నాడు. కొమరం భీమ్ కు కూడా ప్రాంతం అంట గట్టారన్నాడు. ఇలా చాలా చాలా అన్నాడు. మొత్తం మీద స్పీచ్ వింటే విభజన వ్యతిరేకి అనిపిస్తుంది. హనుమంతరావు నచ్చింది, సీమాంధ్రులకు ధైర్యం చెప్పినందుకే అని కూడా అన్నాడు. కానీ విశాఖ సమావేశంకి వచ్చేసరికి అసలు తెలంగాణ విషయం విస్మరించాడు. ఇప్పుడు తెలంగాణ ప్రచారానికి వచ్చేసరికి పూర్తిగా మారిపోయాడు.యుపిఎ హయాంలో ఎందుకివ్వలేదని, చివర్లో ఎందుకిచ్చిందని ప్రశ్నిస్తున్నాడు.  ముందగా ఇచ్చేస్తే బాగుండేది కదా, వెయ్యి మంది బతికేవారు అని కూడా సుద్ధులు చెబుతున్నాడు. 

కానీ అక్కడితో ఆగిపోతే, రేపు అవసరం అయితే సీమాంధ్రలో తిరగడం కష్టమేమో అనుకున్నాడు. అందుకే సమన్యాయం అని బాబు డైలాగును అరువు తెచ్చుకున్నాడు. ఈ  పాటి చిన్న ముక్క అంటే చాలా సీమాంధ్రలు సంతృప్తి పడిపోతారని తెలుసుకున్నాడు. అంటే మొత్తం మీద రాజకీయం నేర్చేసుకున్నట్లే. 

ఇదిలా వుంటే, బాబు ముఖ్యమంత్రి, బావమరిది ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాడు. వదినగారు అదే కూటమిలో ఎంపీకి. ఇక చినబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని డిక్లేర్ చేసేసాడు. 

మరి వీరంతా కుటుంబ సభ్యులు కానట్లు, కెసిఆర్ కుటుంబ సభ్యులే పోటీ చేస్తున్నట్ల తెగబాధపడిపోతున్నాడు పవన్. మరి తెలుగుదేశం పార్టీ కూడా వారసత్య రాజకీయాలు, కుటుంబ రాజకీయాలే చేస్తోందని పవన్ కు తెలియదనా? తెలుసు. కానీ బాణాలు ఇటే వేయాలి కనుక వేస్తున్నాడు. 

అవును ఇంతకీ, చిరంజీవి సినిమాల్లో వున్నాడని ఊరుకోకుండా పవన్ ఎందుకు వచ్చినట్లు? పోనీ అక్కడితో ఆగకుండా నాగబాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లను ఎందుకు దింపినట్లు? పోనీ వాళ్లతో ఊరుకోకుండా మేనల్లుళ్లు, అన్నదమ్ముల పిల్లలు వీళ్ల నెందుకు తెచ్చినట్లు? తమ కాల్షీట్లు తమ వారికే ఇచ్చి, నిర్మాతల అవతారం ఎందుకు ఎత్తించినట్లు?  అంటే అక్కడ సకుటుంబంగా రాజ్యం ఏలేయాలి. ఇక్కడ అవతలి వారిపై బాణాలు వేసేయాలి?  

ఇదే రాజకీయం అంటే? 

ప్రజారాజ్యం ఎమ్మెల్యేలు అంతా పోతే పోయారు. నువు మాత్రం సైలెంట్ గా ఇంట్లో కూర్చోలేకపోయావా అన్నయ్యా..ఎందుకు కాంగ్రెస్ లోకి వెళ్లి, మంత్రి పదవి తెచ్చుకున్నావ్ అని ఒక్కసారి అన్నా అడగగలిగాడా? 

ఇదే రాజకీయం అంటే..

జెపి చాలా మంచివాడు, మీకు , మాకు కావాల్సిన వాడు, అతగాడిపై పోటీ పెట్టకండి..అని బాబు కు చెప్పగలిగాడా?

అదే రాజకీయం అంటే.

మొత్తానికి పవన్ అయోమయంగా కనిపిస్తున్నాడు కానీ, రాజకీయం అబ్బేసింది.

చాణక్య

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?