Advertisement

Advertisement


Home > Articles - Special Articles

చిన్నబోయిన కార్టూన్‌.. ఆర్‌కె లక్ష్మణ్‌ కన్నుమూత

చిన్నబోయిన కార్టూన్‌.. ఆర్‌కె లక్ష్మణ్‌ కన్నుమూత

కార్టూన్‌ చిన్నబోయింది.. ప్రముఖ కార్టూనిస్ట్‌ ఆర్‌.కె.లక్ష్మణ్‌ కన్నుమూశారు. కార్టూన్‌.. వ్యంగ్య చిత్రం.. పేరేదైనా.. దానికి భారతదేశంలో ప్రాముఖ్యత కల్పించింది ఆర్‌.కె.లక్ష్మణ్‌ అనడం అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే, ఆర్‌.కె.లక్ష్మణ్‌ కార్టూన్‌.. సామాన్యుడి కార్టూన్‌. సామన్యుడు ఫక్కున నవ్వుకునేలా.. సామాన్యుడు నవ్వుకుంటూనే ఆలోచించేలా కార్టూన్లు వేయడంలో ఆర్‌.కె.లక్ష్మణ్‌కి సాటి ఇంకెవరూ రారు.

ఐదు దశాబ్దాలపాటు ఓ ప్రముఖ పత్రికకు.. అదీ దేశవ్యాప్తంగా పాపులర్‌ అయిన పత్రికకు కార్టూన్లు వేసి పాఠకుల్ని మెప్పించడమంటే చిన్న విషయం కాదు. ఆ ఘనత ఆర్‌.కె. లక్ష్మణ్‌కి మాత్రమే చెల్లింది.  టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలో యాభయ్యేళ్ళపాటు కార్టూనిస్ట్‌గా పనిచేశారు ఆర్‌.కె. లక్ష్మణ్‌.  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడ్తున్న ఆర్‌.కె.లక్ష్మణ్‌, ఈ రోజు సాయంత్రం పుణేలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఆర్‌.కె.లక్ష్మణ్‌ మృతి పట్ల పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కార్టూన్‌ చిన్నబోయిందంటూ దేశంలోని కార్టూనిస్టులంతా వాపోతున్నారు. ‘కామన్‌ మేన్‌’ అంటూ ఆర్‌.కె.లక్ష్మణ్‌ సృష్టించిన పాత్ర ఆయనతోనే అంతర్థానమైపోయినట్లే లెక్క. ఈ పాత్ర (కార్టూన్‌)కి ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?