Advertisement

Advertisement


Home > Articles - Special Articles

‘గాల్లో మాయమైన’ విమానం

‘గాల్లో మాయమైన’ విమానం

162 మంది ప్రయాణీకులతో వెళ్తోన్న ఎయిర్‌ ఏషియా ఇండోనేషియా విమానం గాల్లో మాయమైందన్న వార్త ఒక్కసారిగా ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసింది. గతంలో ఇలానే మలేసియన్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఓ విమానం దాదాపు 300 మంది ప్రయాణీకులతో మాయమైపోయింది. దాని ఆచూకీ ఇప్పటిదాకా తెలియరాలేదు.

తాజాగా ఎయిర్‌ ఏషియా విమానం మాయమైందన్న వార్తతో విమానయాన రంగం కూడా షాక్‌కి గురైంది. విమాన ప్రయాణం ఎంతవరకు క్షేమం.? అన్న ప్రశ్న గడచిన రెండు భారీ విమాన ప్రమాదాలతో ప్రముఖంగా విన్పిస్తోంది.. చాలా చర్చలు జరుగుతున్నాయి. ఒకటీ అరా సంఘటనలు.. అని తీసి పారేయడానికి లేదు. ఎందుకంటే ప్రపంచం చిన్నదైపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో విమానయానం తప్పనిసరైపోయింది చాలామందికి.

ఇక, ఎయిర్‌ ఏషియా విమానం అదృశ్యం విషయానికి వస్తే, ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు విమానంతో సంబంధాలు తెగిపోయాయని సంస్థ ప్రకటించింది. ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలూ ప్రారంభించామనీ అంటున్నారు ఎయిర్‌ ఏషియా ప్రతినిథులు. మరోపక్క, క్రాష్‌ ల్యాండ్‌ అయ్యే అవకాశాలే ఎక్కువని వైమానిక రంగ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?