నిర్మాత బండ్ల గణేష్ ది ఓ చిత్రమైన వ్యవహారం. కొబ్బరికాయ కొట్టిననాడే విడుదల తేదీ చెబుతుంటాడు. అలాగే టెంపర్ కు జనవరి 9 విడుదల అన్నాడు. కానీ ఎక్కడలేని సినిమా కష్టాలు వచ్చి, ఆఖరికి ఇప్పుడు ఫైనల్ షెడ్యూలు ప్రారంభమైంది. ఇప్పుడు తాజా తేదీ ఫిబ్రవరి 5 అంటున్నాడు. అంతవరకు బాగానే వుంది.
అంతకు ముందే బన్నీ-త్రివిక్రమ్ సినిమాకు ఫిబ్రవరి తొలివారం విడుదల ముహుర్తం అని ప్రకటించారు. బహుశా ఫిబ్రవరి అయిదు లేదా ఆరు కావచ్చు. మరి రెండు భారీ సినిమాలు ఢీకొంటాయా? లేదా ఎవరో ఒకరు ముందుకో వెనక్కో జరుతారా? ఢీకొనడం ఎవరికీ మంచిది కాదు..
ఇవ్వాళ్టి టాలీవుడ్ పరిస్థితిలో. అందువల్ల ఎవరో ఒకరు తేదీ మార్చుకోవడం గ్యారంటీ. ఇప్పుడు ఆ అవసరం కూడా నిర్మాతగా బండ్లకు,హీరోగా ఎన్టీఆర్ కే ఎక్కువగా వుందేమో?