Advertisement

Advertisement


Home > Articles - Special Articles

అదిరిపోయే ఫీచర్లు: ఐఫోన్-8 లాంచ్

అదిరిపోయే ఫీచర్లు: ఐఫోన్-8 లాంచ్

ఐఫోన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ మోడల్స్ అధికారికంగా లాంచ్ అయ్యాయి. అమెరికాతో పాటు ఇండియాలో ఈ మొబైల్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే భారత్ లో మాత్రం ఈనెల 29 నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయి.

లక్ష మార్క్ టచ్ చేయలేదు

ఐఫోన్ 9లో బేసిక్ మోడల్ నుంచి ఐఫోన్ 8-ప్లస్ లో హైఎండ్ మోడల్ వరకు ధరల్ని 64వేల రూపాయల నుంచి 86వేల రూపాయల మధ్య ఫిక్స్ చేసింది కంపెనీ. నిజానికి ఐఫోన్ 8-ప్లస్ హైఎండ్ మోడల్ ధరను లక్ష రూపాయలుగా నిర్ణయిస్తారని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ అమెరికా-ఇండియా మధ్య ధరల వ్యత్యాసాన్ని దృష్టిలో పెట్టుకొని 6 అంకెల ఫిగర్ ను ఇంకా టచ్ చేయలేదు. 

మోడల్స్ వారీగా ధరల విషయానికొస్తే.. ఐఫోన్-8లో 64జీబీ మోడల్ ధరను 64వేల రూపాయలుగా ఫిక్స్ చేయగా.. ఇదే సిరీస్ లో 256 జీబీ మోడల్ ధరను 77వేల రూపాయలుగా నిర్ణయించారు. ఇక ఐఫోన్ 8-ప్లస్ లో 64జీబీ మోడల్ ధరను 73వేలు.. 256జీబీ మోడల్ ధరను 86వేల రూపాయలుగా ఫిక్స్ చేశారు.

ఫీచర్స్ అంతకుమించి..

ఐఫోన్ 7, 7-ప్లస్ మోడల్స్ కు అప్ గ్రేడ్ వెర్షన్ గా 8 సిరీస్ ను ప్రవేశపెట్టింది ఆపిల్ సంస్థ. 7 సిరీస్ తో పోలిస్తే 8లో మరిన్ని రంగుల్ని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. వీటితో పాటు 8 సిరీస్ లో డిస్ ప్లేను మరింత మెరుగుపరిచారు. సౌండ్ క్వాలిటీని మరో 25శాతం పెంచారు. (సౌండ్ విషయంలో ఐఫోన్ నంబర్ వన్) వీటితో పాటు లుక్ పరంగా స్వల్ప మార్పులు చేశారు. వెనక, ముందు భాగాలు రెండింటికి గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చారు.

వైర్ లెస్ చార్జింగ్ ఆప్షన్ ఎలాగూ ఉంది. వీటితో పాటు ఎ-11 సిక్స్-కోర్ ప్రాసెసర్ ను అమర్చారు. వీడియో ఎన్ కోడింగ్ తో పాటు మల్టిపుల్ టాస్క్స్ ను మరింత వేగంగా పూర్తిచేసే సామర్థ్యం ఈ ప్రాసెసర్ కు ఉంది.

కెమెరా హైలెట్

ఇక అన్నింటికంటే ముఖ్యమైన కెమెరా ఫీచర్ ను మరింత అభివృద్ధిచేశారు 8-ప్లస్ మోడల్ లో. ప్రస్తుతం ఈ విభాగంలోనే ఆపిల్ కు గట్టిపోటీనిస్తున్నాయి శాంసగ్, వన్ ప్లస్, అప్పో లాంటి కంపెనీలు. ఆండ్రాయిడ్ వెర్షన్ లో ఐఫోన్ కు దీటుగా కెమెరా ఆప్షన్లు అందిస్తున్నాయి. అందుకే వాటికి మరింత పోటీనిచ్చేలా కెమెరా ఫీచర్లు వచ్చాయి ఐఫోన్ 8ప్లస్ లో. 

8 సిరీస్ లో ఉన్న కెమెరాలతో మరింత స్పష్టంగా, సునిశితంగా ఫొటోల్ని తీసుకోవచ్చని.. ఫొటోలో ప్రతి ఎలిమెంట్ ను స్పష్టంగా చూడొచ్చని ప్రకటించింది ఆపిల్ సంస్థ. ఇక వీడియో విషయానికొస్తే.. సెకెండ్ కు 240 ఫ్రేమ్స్ తో 1080 పిక్సల్స్ నాణ్యతతో వీడియోస్ ను చిత్రీకరించుకోవచ్చని ప్రకటించింది. ఐఫోన్ మొబైల్స్ లో ఇదే ది బెస్ట్ ఫీచర్ అని చెబుతోంది కంపెనీ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?