Advertisement

Advertisement


Home > Articles - Special Articles

న్యూ ఇయర్ పోటీ: జియో Vs ఎయిర్ టెల్

న్యూ ఇయర్ పోటీ: జియో Vs ఎయిర్ టెల్

నూతన సంవత్సరం వస్తుందంటే ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఎయిర్ టెల్ మాత్రం తలపట్టుక్కూర్చుంది. జియో నుంచి వెల్లువలా వస్తున్న ఆఫర్లను ఎలా ఎదుర్కోవాలో అర్థంకాక, కస్టమర్లను నిలుపుకోలేక నానా తంటాలు పడుతోంది. జియో ప్రకటించిన తాజా రీచార్జి ప్యాక్స్ తో మరోసారి ఎయిర్ టెల్ కు చుక్కులు కనిపిస్తున్నాయి.

హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్స్ అంటూ జియో సరికొత్తగా రెండు రీచార్జ్ ఆఫర్లు ప్రవేశపెట్టింది. ఇది ప్రవేశపెట్టిన రూ.199, రూ.299 రీచార్జీ ప్లాన్స్ క్షణాల్లో వినియోగదారుల్ని ఆకట్టుకున్నాయి. అన్-లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు వంద మెసేజీల ఆఫర్ అందిస్తూనే.. ప్రతి రోజు 1.2 జీబీ, 2జీబీ 4జీ డేటాను ఉచితంగా అందించే ప్లాన్స్ ఇవి. 28 రోజుల వాలిడీటీ కలిగి ఉన్నాయి.

హ్యాపీ న్యూ ఇయర్ అంటూ జియో ఇలా హఠాత్తుగా మరోసారి రీచార్జ్ రేట్లు తగ్గించడంలో ఇప్పుడు ఎయిర్ టెల్ కూడా మరింత దిగి వచ్చింది. సేమ్ టు సేమ్ 199 ప్లాన్ నే ఇది కూడా ప్రకటించింది. తాము కూడా ఉచిత కాల్స్, ఎస్ఎమ్మెస్ లు ఇస్తామని ఫ్రీగా 4జీ డేటా ఇస్తామని ప్రకటించింది. అయితే డేటా విషయంలో జియోతో పోలిస్తే ఎయిర్ టెల్ అందిస్తోంది కాస్త తక్కువే.

మరోవైపు జియో ప్రకటించిన 299 ఆఫర్ కు మాత్రం ఎయిర్ టెల్ చేతులెత్తేసింది. ఈ ప్లాన్ లో ప్రతి రోజూ 4జీ స్పీడ్ తో 2జీబీ డేటాను అందిస్తోంది జియో. ఎయిర్ టెల్ మాత్రం 299లో 2జీబీ ఇవ్వలేమని ప్రకటిస్తూ.. రూ.349 రీచార్జ్ ప్యాక్ ను ప్రవేశపెట్టింది.

జియో, ఎయిర్ టెల్ కు పోటీగా గమ్మత్తుగా ఈసారి బీఎస్ఎన్ఎల్ కూడా సిద్ధమైంది. ఈ నూతన సంవత్సర కానుకగా 186 రూపాయల అతి చవకైన ఆఫర్ ప్రవేశపెట్టింది. అంతేకాదు.. ఈ ఆఫర్ లో ఏకంగా ప్రతి రోజు 5 జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తోంది. అన్-లిమిటెడ్ కాల్స్, ఉచిత మెసేజీలు ఉండనే ఉన్నాయి. కాకపోతే జియో, ఎయిర్ టెల్ తో పోలిస్తే తమ ఆఫర్లకు గట్టి ప్రచారం కల్పించలేకపోతోంది బీఎస్ఎన్ఎల్.

ఈసారి న్యూ ఇయర్ పోటీ నుంచి వోడాఫోన్, ఐడియా దూరంగా ఉన్నాయి. అతి తక్కువ ధరలకు ప్రీ-పెయిడ్ ఆఫర్లు ప్రవేశపెట్టి ఇప్పటికే ఆర్థికంగా చిక్కుల్లో పడ్డాయి ఈ రెండు సంస్థలు. ఇప్పుడు అదనంగా మరిన్ని ఆఫర్లు ఇవ్వడానికి అవి ఆసక్తి చూపడం లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?