Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ట్రూకాలర్ చాలా డేంజరంట

ట్రూకాలర్ చాలా డేంజరంట

స్మార్ట్ ఫోన్ వాడేవాళ్లకు ట్రూ కాలర్ గురించి తెలియకుండా వుండదు. మనకు ఎవరు ఫోన్ చేసారన్నది ముందుగానే మన కాంటాక్ట్ లిస్ట్ లో లేకపోయినా, పేరు చూపిస్తుసంది ఈ అప్లికేషన్. ఇది స్మార్ట్ ఫోన్ లు వాడేవారే అప్ డేట్ చేసే అప్లికేషన్. రోజు రోజుకూ ప్రతి ఒక్కరి ఫోన్ లోని కాంటాక్ట్ ఇన్ ఫర్ మేషన్ గ్రహించి, సమాచారాన్ని అప్ డేట్ చేస్తూ వుంటుంది. అలాగే మనకు తెలిసిన వారి పేర్లు మనమూ అప్ డేట్ చేస్తూ వుండోచ్చు. 

అయితే ఇప్పడు ఈ అప్లికేషన్ ను నిషేథిత అప్లికేషన్ల జాబితాలోకి చేర్చింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా రక్షణ దళాల్లో పని చేసేవారు వాడకూడని అప్లికేషన్లు అంటూ కేంద్ర ఇంటిలిజెన్స్ శాఖ సమారు ముఫై వరకు జాబితా రెడీ చేసింది. వాటిలో ఈ ట్రూకాలర్ కూడా వుంది. 

వాస్తవానికి ట్రూ కాలర్ వల్ల బ్యాటరీ ఎక్కవగా డ్రయిన్ అవుతుందని, అలాగే ఫోన్ వర్కింగ్ స్లో అవుతుందని ఓ టాక్ వుంది. ఇప్పుడు దీనికి తోడు ట్రూ కాలర్ ద్వారా మన ఫోన్ లలో సమాచారాన్ని చైనా ఇంటిలిజెన్స్ జనాలు తెలుసుకుంటారన్న విషయం బయటకు వచ్చింది. దీనికి మన 'స్మార్ట్' బాబులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?