Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బ్రహ్మానందం జిల్ అనిపించలేదా?

బ్రహ్మానందం జిల్ అనిపించలేదా?

జిల్ సినిమా క్లాస్ యాక్షన్ జోనర్ అనిపించుకుంది కానీ, ఎంటర్ టైనర్ కాస్త లోపం అన్నారు. అందుకే చివరి నిమిషంలో పోసాని, ప్రభాస్ శ్రీను ట్రాక్ జోడించారు. అయితే ఈ సినిమా కోసం బ్రహ్మానందం కాల్ షీట్లు తీసుకున్నారని, షూట్ చేసారని, కానీ కథలో ఇమకడ పక్కన పెట్టారని ఓ వదంతి వినిపిస్తోంది. 

ఇదెంతవరకు నిజమో తెలియదు. మరీ కామెడీ ఎక్కువైతే సినిమాను ప్రెజెంట్ చేయాలనుకున్న క్లాస్ టచ్ పోతుందని భావించి, ప్లాన్ మార్చారని తెలుస్తోంది. మరి ఇప్పుడు మరి కాస్త ఫన్ వుంటే బాగుండేదని జనం అనుకుంటున్నారు కాబట్టి, బ్రహ్మీ సీన్లు ఏమైనా బయటకు వస్తాయా? ఏమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?