Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

బాలీవుడ్ లో మరో 2 బయోపిక్స్

బాలీవుడ్ లో మరో 2 బయోపిక్స్

బాలీవుడ్ లో బయోపిక్స్ శకం కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో బయోపిక్స్ తెరపైకొచ్చాయి. త్వరలోనే ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లా బయోపిక్ కూడా రానుంది. ఇప్పుడు దీనికి అదనంగా మరో 2 బయోపిక్స్ రెడీ అయ్యాయి. ఒకదాంట్లో హృతిక్ రోషన్, మరో సినిమాలో రణ్వీర్ సింగ్ హీరోలుగా నటించేందుకు ఒప్పుకున్నారు.

పాట్నాకు చెందిన మ్యాథమెటీషియన్ ఆనంద్ కుమార్ జీవితాన్ని వెండితెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు వికాస్ బాల్. ప్రతి ఏటా కనీసం 30 మంది విద్యార్థుల్ని ఐఐటీలుగా తీర్చిదిద్ది దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్నాడు ఆనంద్. అందుకే అతడి జీవితం, కెరీర్ ను సినిమాగా తీయాలని డిసైడ్ అయ్యాడు వికాస్. ఈమేరకు వికాస్-హృతిక్-ఆనంద్ మధ్య చర్చలు కూడా జరిగాయి. ఈ ప్రాజెక్టుకు సూపర్-30 అనే పేరు అనుకుంటున్నారు.

తెరపైకి మరో బయోపిక్ కూడా రాబోతోంది. కపిల్ దేవ్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నాడు దర్శకుడు కబీర్ ఖాన్. ఇప్పటికే వెండితెరపైకి క్రీడల నేపథ్యంలో ఎన్నో బయోపిక్స్ వచ్చాయి. కానీ ఇది చాలా స్పెషల్. ఇండియాకు ప్రపంచకప్ వచ్చిన మధుర క్షణాల్ని వెండితెరపై సినిమాటిక్ గా చూపించే ప్రయత్నం. కపిల్ దేవ్ జీవితం మొత్తాన్ని చూపించకుండా కేవలం 1983 వరల్డ్ కప్ చుట్టూ తిరిగేలా కపిల్ జీవితాన్ని చూపించనున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?