Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఇది అభివృద్ది కానే కాదు

ఇది అభివృద్ది కానే కాదు

సహేతుక విమర్శ ఎప్పుడూ అవసరం. జగన్ పాలనలో పరిశ్రమలు రాలేదని అంటే అనొచ్చు. కానీ అంత మాత్రం చేత నిర్మాణంలో వున్న పోర్టులను విస్మరించకూడదు. స్కూళ్లు, ఆసుపత్రులను చూడనట్లు నటించకూడదు. మెడికల్ కాలేజీల సంగతి ప్రస్తావించకుండా వుండకూడదు. దేనికి దాన్నే విడివిడిగా చూడాలి. విమర్శించాలి. బాగున్న వాటిని శభాష్ అనాలి.

సింహాచలం గ్రామం నుంచి శొంఠ్యాం వైపు డబుల్ రోడ్ నిర్మాణం జరుగుతోంది. యాభై ఏళ్లుగా చిన్న సింగిల్ రోడ్ గా వుంది. ఇప్పుడు చూస్తుంటే అధ్భుతమైన రోడ్ తయారవుతోంది. శ్రీకాకుళం ఆమదాల వలస మధ్యలో డబుల్ రోడ్ తయారీలో వుంది. వీరఘట్టాం పట్టణం వైపు ఇలాగే రోడ్ వెడల్పు జరుగుతోంది సీతంపేట కొండ ప్రాంతంలో అద్భుతమైన తిరుమల వెంకన్న ఆలయాన్ని టిటిడి నిర్మించింది.

విజయనగరం నుంచి తాటిపూడి రిజర్వాయర్ మీదుగా బౌడరా వరకు అద్భుతమైన విశాలమైన రోడ్ రెడీగా వుంది. పర్యాటకులకు ఈ మార్గం భలే కనువిందు. ఈ రోడ్ మీదుగానే అరుకు లోయకు వెళ్లవచ్చు. అరకు లోయలో నాలుగు లైన్ల అద్భుతమైన మెయిన్ రోడ్ రెడీ అవుతోంది. అరకులో స్కూలు భవనాలు, ప్రభుత్వ భవనాలు కొత్తగా కట్టినవి భలేగా వున్నాయి. బహుళ అంతస్తుల స్కూలు భవనాలు నిర్మించారు. అరకు వెళ్లే దారిలోని గిరిజన గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాలు నిర్మాణం చేసుకున్నాయి.

విజయనగరం దగ్గర జగనన్న కాలనీ అంటూ ఏర్పాటు చేసిన దాంట్లో దాదాపు వందకు పైగా ఇళ్లు కనువిందు చేస్తున్నాయి. జస్ట్ కొన్ని గంటలు విహంగ వీక్షణం చేస్తేనే తెలిసినవి ఇవి. కాస్త లోతుకు వెళ్తే ఇంకెన్నైనా కనిపించవచ్చు.

ప్రతిపక్షాలు విమర్శించాలి. ప్రశ్నించాలి. వాటి డ్యూటీ అది. కానీ అసలు జగన్ పాలనలో మొత్తం అధోగతి తప్ప మరేమీ లేదని నిత్యం అక్షరాలు వండి వార్చడం మాత్రం తప్పని చెప్పక తప్పదు. తప్పు ఎవరు చేసినా తప్పే కనుక.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?