Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ పబ్ లో ఆ హీరో తండ్రికి వాటా?

ఆ పబ్ లో ఆ హీరో తండ్రికి వాటా?

ఇప్పుడు హైదరాబాద్ లోని పబ్ లపై ఎక్సయిజ్ శాఖ దృష్టి పడింది. వీటిల్లో చాలా పబ్ ల్లో డ్రగ్స్ సరఫరా జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా వుంటే చిరకాలంగా వున్న ఓ పబ్, అది కూడా చాలా పాపులర్ బ్రాండింగ్ నేమ్ తో వున్న పబ్ ఇప్పుడు ఓ పంపిణీ దారుడి పార్టనర్ షిప్ లో వుందట. తెలంగాణలో లీడింగ్ పంపిణీ దారుల్లో ఒకరైన వ్యక్తి ఆ పబ్ లో మెజారిటీ వాటలు కలిగి వున్నారట. అయితే అదే పంపిణీదారుడి వ్యాపారాల్లో టాలీవుడ్ కు చెందిన ఓ అగ్ర నిర్మాత స్లీపింగ్ పార్టనర్ అని వినిపిస్తోంది.

ఆ అగ్ర నిర్మాతకు వున్న హీరో కొడుకు, హీరో కాని కొడుకు ఇద్దరూ డ్రగ్స్ అలవాట్లు వున్నవారే అని గ్యాసిప్ లు గత రెండు వారాలుగా వినిపిస్తూనే వున్నాయి. వారికి తమకు వాటాలు వున్న ఆ పబ్ లోనే అలవాటు అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రాత్రికి రాత్రి ఎన్నికోట్లు అయినా తీసి ఖర్చు చేయగల స్థోమత, రెండు ప్రభుత్వాలను ప్రభావితం చేయగల పలుకుబడి సదరు నిర్మాతకు వుండడంతో, ఫ్రస్తుతానికి అయితే సమస్య ఏమీలేదు. కానీ పబ్ ను, దాని సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు కాబట్టి, రాను రాను ఎలా వుంటుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?