Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కుటుంబం ఒత్తిళ్లు.. తప్పుకుంటున్న ఐష్!

కుటుంబం ఒత్తిళ్లు.. తప్పుకుంటున్న ఐష్!

‘యే దిల్ హే ముష్కిల్’  సినిమాలో ఐష్ నటించడం, కనిపించిన తీరుపై బచ్చన్ల అసంతృప్తి బాహాటంగానే అర్థమైపోయింది. కోడలు ఇది వరకూ నటించిన రెండు సినిమాల ప్రమోషన్ లో భాగస్వామి అయిన అమితాబ్.. ఈ తాజా సినిమా ను ఆది నుంచి పట్టించుకోకపోవడంతో మొదలైన ఈ వ్యవహారం.. ఇందులో రణ్ భీర్ తో ఐష్ సన్నిహితంగా నటించిన సన్నివేశాలను ఆయన దగ్గరుండి సెన్సార్ చేయించాడనే వార్తలు రావడం తో పీక్స్ కు వెళ్లింది.

ఇక ఈ సినిమా గురించి అభిషేక్ కూడా ఎక్కడా పొరపాటున కూడా మాట్లాడలేదు. ఐష్ ఆ మధ్య నటించిన సరబ్జీత్, జగ్బా వంటి సినిమాల విషయంలో ఆనందంగా స్పందించిన బచ్చన్లు ఈ సారి అస్సలు మాట్లాడలేదు. దీనికంతటికీ కారణం ఐష్ గ్లామరస్ రోల్ లో కనిపించడం వారికి ఇష్టం లేదు.. అనే మాటే వినిపించింది.

ఈ నేపథ్యంలో.. ఈ సినిమా ప్రమోషన్ కు ఐశ్వర్య బిగ్ బాస్ 10లో కూడా పాల్గొంటుందనే వార్త మరింత ఆసక్తికరంగా నిలిచింది. అయితే, ఇప్పుడు మాత్రం అదేమీ లేదని తెలుస్తోంది. అది మాత్రమే కాదు.. ఇకపై ఈ సినిమా ప్రమోషన్ కే దూరంగా ఉండాలని ఐష్ డిసైడ్ అయ్యిందని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమా యూనిట్ అయితే.. ఐష్ ను బిగ్ బాస్ కు పంపించి.. సినిమాను ప్రమోట్ చేయిద్దామని భావించిందని.. దానికి మొదట ఐష్ కూడా ఓకే చెప్పిందని వార్తలు వచ్చాయి.

అయితే ఇక ఈ సినిమాను ఐష్ ఇంతటితో వదిలేయాలని నిర్ణయించుకుందట. ఐష్ విషయంలో బచ్చన్ల ఒత్తిళ్లు ఈ విధమైన ఫలితాలను ఇస్తున్నాయని తెలుస్తోంది. మరి సినిమా విడుదల కాకుండానే ఇంత జరుగుతోందంటే.. ఇకపై అసలు ఐష్ వేరే సినిమాల్లో అయినా నటించేనా? విరమించుకుంటుందా? అనే సందేహాలూ రేగుతున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?