Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

ఎకె కు 'కిర్రాక్' ప్రాఫిట్ ?

ఎకె కు 'కిర్రాక్' ప్రాఫిట్ ?

ఎకె ఎంటర్ టైన్ మెంట్స్, మీడియం సినిమాల బ్యానర్. అయితే సినిమాలు ఎక్కువే కానీ లక్ తక్కువ. అలా అని లాస్ వుండదు. జస్ట్ అలా అలా లాభం చేసుకుంటూ వుంటారు. కానీ ఫస్ట్ టైమ్ దాదాపు ఆరేడు కోట్లు ఫ్రాఫిట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిఖిల్ తో తీసిన కిర్రాక్ పార్టీ ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ కు పంట పండించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను చాలా తక్కువలోనే ఫినిష్ చేసారు. పబ్లిసిటీ ప్లానింగ్ అన్నీ కలిపి జస్ట్ ఎనిమిది కోట్ల లోపు వ్యయంతోనే ఫినిష్ చేసినట్లు తెలుస్తోంది. హీరోను పక్కన పెడితే పెద్దగా కాస్టింగ్ ఎక్స్ పెండిచర్ లేదు.

షూటింగ్ కూడా ఎకే వారి స్వంత కాలేజీలో ఎక్కువగా జరిగింది. కొత్త వాళ్లను బాగా తీసుకున్నారు. కొత్త దర్శకుడు. ఇలా అన్ని విధాలా జస్ట్ ఎనిమిది కోట్ల లోపు వ్యయంతోనే ఫినిష్ చేసినట్లు వినికిడి.

సినిమా ఫినిష్ చేయడానికి ముందే శాటిలైట్ మూడున్నర కోట్లకు పైగా జెమినికి ఇచ్చారు. డిజిటల్ మరో కోటి వరకు వచ్చే అవకాశం వుంది. వీటితో పాటు థియేటర్ రైట్స్ అన్నీ కలిపి 13నుంచి 14కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో టేబుల్ ప్రాఫిట్ గా అయిదారు కోట్లు చేతిలో వుండే అవకాశం ఏర్పడింది. కిర్రాక్ పార్టీ టఫ్ కాంపిటీషన్ మధ్య ఫిబ్రవర్ 9న విడుదలవుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?