Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అఖిల్ తరువాతి సినిమా ఎవరితో?

అఖిల్ తరువాతి సినిమా ఎవరితో?

హను రాఘవపూడి సినిమాతో ఎదురైన చేదు అనుభవంతో అఖిల్ అక్కినేనిని, నాగ్ ను కాస్త జాగ్రత్తగా వుండేలా చేసింది. హను ను ఓకె చేసుకుని, తీరా వేరే నిర్మాత దగ్గర అడ్వాన్స్ వుండడంతో, ఓకె అనుకున్నా వీలు లేకుండా పోయింది. అందుకే ఈ సారి ప్రాజెక్టులు ఫైనల్ చేసేటపుడు అన్నీ ఆచి తూచి చూడాలనుకుంటున్నారు. 

ఇప్పటికే విక్రమ్ కుమార్ డైరక్షన్ లో ఓ సినిమా ఓకె చేసారు. విక్రమ్ కుమార్ సినిమా అంటే కాస్త టైమ్ పట్టే వ్యవహారమే. డిసెంబర్ లో మొదలయినా ఆరునెలల పైమాటే. ఆ తరువాత సినిమా ఏమిటన్నది కూడా ఇప్పటి నుంచే అఖిల్ క్యాంప్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే డైరక్టర్ మారుతి చెప్పిన లైన్ ఒకటి ఓకె అయి వుంది. 

అయితే ఈ సినిమాకు నిర్మాత ఎవరు అన్నది మాత్రం డిసైడ్ కాలేదు. అటు సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఇటు అల్లు అరవింద్ ఇద్దరు సుముఖంగా వున్నారు. చైతన్యకు హిట్ ఇచ్చిన బ్యానర్లు ఈ రెండూ. అందువల్ల ఎవర్ని కాదనలేని పరిస్థితి. వన్స్ బ్యానర్ ఫైనల్ అయితే అఖిల్ రెండో సినిమా అనౌన్స్ మెంట్ కూడా వచ్చేస్తుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?