Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అమలపై సీనియర్‌ సినీవాలా హాట్‌కామెంట్స్‌!

అమలపై సీనియర్‌ సినీవాలా హాట్‌కామెంట్స్‌!

నటీమణి అమలపాల్‌ ఈ మధ్య ఒక హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. పెళ్లికి ముందు కేవలం నటిగానే గుర్తింపు కలిగిన అమల వివాహం తర్వాత మాత్రం అంతకు మించి హాట్‌ టాపిక్‌ అవుతోంది. వరసపెట్టి వివాదాలు ఈమెను వెన్నాడుతున్నాయి. ఒక హీరోతో సాన్నిహిత్యంగా ఉంటున్నందు వల్లనే ఈమెకు భర్త విడాకులు ఇచ్చాడని, ఈమె అత్తామామలు ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలు రావడంతో అమల వివాదాల పాలయ్యింది.

చివరకు భర్త నుంచి విడిపోయింది. ఆ తర్వాత సుచీలీక్స్‌ అమలను రచ్చలోకి లాగింది. సుచీలీక్స్‌లో ఈమె నగ్న వీడియోలు వస్తాయని ప్రచారం జరిగింది. ఈమె తమిళ హీరో ధనుష్‌కు చాలా క్లోజ్‌ అని సుచీలీక్స్‌ ట్వీట్లలో పేర్కొన్నారు. ఇలా వరస వివాదాలు వచ్చాయి. ఆపై అమల తీరులో కూడా మార్పు వచ్చింది.

మాజీ భర్తపై బహిరంగంగా ప్రేమను చాటుకుంది. అతడు ఓకే అంటే.. మళ్లీ పెళ్లికి కూడా రెడీ అని చెప్పుకొచ్చింది. ఇలాంటి వ్యాఖ్యలు ఈమెను మరింత పలుచన చేశాయి. అంత జరిగిన తర్వాత కూడా అతడిపై ప్రేమను వ్యక్తం చేయడం ఈమె బేలతనాన్ని చాటాయి. ఆపై కారు వివాదం. టాక్స్‌ మిగుల్చుకోవడానికి పాండిచ్చేరి రిజిస్ట్రేషన్‌తో కారు కొనడం మరో వివాదంగా మారింది.

ఆ సమయంలో అమల తీవ్రంగా స్పందించింది. వెంటాడుతున్న వివాదాలకు దూరంగా పారిపోవాలని ఉందని అమల స్వయంగా ట్వీట్‌ చేసింది. అయితే కారు విషయంలో ఈమె చేసిన తప్పు స్పష్టం అయిపోయింది. ఒక రూమ్‌ను రెంటుకు తీసుకుని.. ఆ అడ్రస్‌తో ఈమె కారు కొన్నవైనం స్పష్టం అయిపోయింది. దీంతో అమల అక్కడ కార్నర్‌ అయ్యింది.

అదలా వార్తల్లో ఉండగానే.. తిరుట్టుపయలే-2 సినిమాకు సంబంధించిన పోస్టర్‌లో తన లుక్‌ గురించి ఈమె  చేసిన వ్యాఖ్యానాలు హాట్‌ కామెంట్స్‌ అయ్యాయి. తను బొడ్డును చూపుతూ ఎక్స్‌పోజింగ్‌ చేయడం అంత వివాదం అవుతుంది అనుకోలేదని అమల చెప్పుకొచ్చింది. ఇలా తన మీద తనే హాట్‌ కామెంట్‌ చేసుకుని ఈమె వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో అమల మాటలపై వాడీవేడి స్పందనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆమెపై సీనియర్‌ ఫిల్మ్‌మేకర్‌ బి.లెనిన్‌ ఆసక్తిదాయకంగా స్పందించాడు. ఈయన మాటల్లో కొంత అసభ్యత కూడా ధ్వనించడం విశేషం.

అమల వ్యాఖ్యలపై స్పందిస్తూనే లెనిన్‌ ఇలా మాట్లాడాడు. 'ఆమె నాభి గురించి మాత్రమే మాట్లాడింది. అయితే కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ను ఉపయోగించుకుని ఇప్పుడు అంతకు మించి, అంతకన్నా కింద అవయావాలను కూడా చూపగలం.. అంతా చూపించేయగలం' అని లెనిన్‌ వ్యాఖ్యానించాడు. ఒకవైపు అమల మాటతీరుపై విరుచుకుపడుతూనే మరోవైపు లెనిన్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇవి దారుణమైన వ్యాఖ్యలు అని వేరే చెప్పనక్కర్లేదు. వయసు మీదపడిన ఈయన ఇలా మాట్లాడటం అంత సబబుగాలేదు.

అలాగే తిరుట్టుపయలే రొమాంటిక్‌ సీన్లలో నటించడం గురించి అమల స్పందించిన తీరపైనా ఈయన విరుచుకుపడ్డాడు. 'రొమాంటిక్‌ సీన్లలో నటించడానికి బాబీ సింహా కొంత తటపటాయించాడు. అయితే నేనే చొరవ చూపా.. ఆ సీన్ల విషయంలో నాదే పైచేయి..' అని అమల వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై లెనిన్‌ స్పందిస్తూ.. 'పైచేయి అంటే? దాని అర్థమేమిటి? అలాంటి మాటల అంతరార్థం ఏమిటి?' అని లెనిన్‌ ప్రశ్నించాడు. ఆమె వ్యాఖ్యల్లో అసభ్యత ఉందని.. మరింత అసభ్యంగా వ్యాఖ్యానించాడు ఈయన.

కేవలం అమల మీద మాత్రమే కాదు.. దీపికాపదుకునే మీద కూడా లెనిన్‌ విరుచుకుపడ్డాడు. దీపిక అసభ్యంగా నటిస్తుంది అనేది ఈయన మోపుతున్న అభియోగం. 'దీపిక తండ్రి ప్రకాష్‌ పదుకునే ఆమెను ఇంటి నుంచి వెల్లగొట్టాడు...' అని లెనిన్‌ అన్నాడు. మరి ఈ లెనిన్‌ అల్లాటప్పా వ్యక్తి ఏమీకాదు. జాతీయ అవార్డులు పొందిన వ్యక్తి కూడా. దక్షిణాది సినిమాల్లో ప్రధానంగా ఎడిటింగ్‌ వర్క్‌ చేసిన ఈయన.. ఆపై రైటర్‌గా, దర్శకుడిగా కూడా మారాడు. అటు ఎడిటర్‌గా జాతీయ అవార్డును అందుకున్నాడు, డైరెక్టర్‌గా కూడా నేషనల్‌ అవార్డును పొందాడు. మరి అంత నేపథ్యం ఉన్న ఈయన ఏమాత్రం పరిణతి లేకుండా ఇలా మాట్లాడటం.. అసభ్య వ్యాఖ్యానాలు చేయడం విడ్డూరంగా ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?