Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

‘బాహుబలి’ కోసం మినహాయింపులా!

‘బాహుబలి’ కోసం మినహాయింపులా!

మంచికో చెడుకో.. తమ భాష పరిశ్రమలోకి డబ్బింగ్ లను అడుగుపెట్టనీయడం లేదు కన్నడీగులు. అర ప్రాణాలతో దశాబ్దాలుగా కొట్టుమిట్టాడుతున్న తమ మాతృ భాష చిత్ర పరిశ్రమను కాపాడుకునేందుకు సినిమాల, సీరియళ్ల డబ్బింగులపై శాశ్వత నిషేధం విధించేశారు. తెలుగు, తమిళ, హిందీ, ఆంగ్ల.. ల నుంచి ఇతర భారతీయ భాషల్లోకి సినిమాలు అనువాదం కావడం సహజమే అయినా, ఇలా కూడా ప్రతియేటా కొన్ని వందల కోట్ల వ్యాపారం జరుగుతున్నా… శాండల్ వుడ్ మాత్రం దీనికి దూరంగా ఉంది.

అయినప్పటికీ కన్నడ చిత్ర పరిశ్రమ మనుగడ కానాకష్టంగానే కొనసాగుతోంది. అనువాదాలు నిషేధం అయినప్పటికీ.. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లిష్ .. భారీ చిత్రాలు డైరెక్టుగా విడుదలైపోయి శాండల్ వుడ్ ను డామినేట్ చేస్తున్నాయి. అక్కడి స్ట్రైట్ సినిమాల మార్కెట్ ను దెబ్బతీస్తూ ఈ సినిమాలు వసూళ్లను రాబడుతున్నాయి. ఇప్పుడిప్పుడు కన్నడ నుంచి కూడా కొన్ని మంచి మంచి సినిమాలు వస్తున్నాయి.

మరి ఇలాంటి నేపథ్యంలో.. ‘బాహుబలి-2’ విషయంలో కొత్త మాట వినిపిస్తోంది. ఈ సినిమాను కన్నడలోకి అనువాదం చేయనున్నారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మరి దశాబ్దాలుగా శాండల్ వుడ్ లో ఉన్న నియమాన్ని బ్రేక్ చేస్తారన్నట్టుగా చెబుతున్నారు. ఇదంతా బాహుబలి గొప్పదనమని ప్రచారాన్ని అందుకున్నారు!

బాహుబలి కోసం ఇలా ప్రచారం చేసి పెట్టే వాళ్లు చాలా మందే ఉన్నారు.  రాజమౌళి అంటే కర్ణాటకకు చాలా ఇష్టమని, ఆయనకు పద్మ అవార్డు విషయంలో కూడా వాళ్లే సిఫార్సు చేశారని.. ఇప్పుడు ఆయన తీసిన ‘కళాఖండం’ ను కూడా డబ్ చేయడానికి అనుమతి ఇచ్చేస్తారని కూడా చెబుతున్నారు. మరి ఇవన్నీ జోక్ లుగా మిగిలిపోకూడదు సుమా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?