Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బ్రహ్మోత్సవం కు..అ..ఆ దెబ్బ?

బ్రహ్మోత్సవం కు..అ..ఆ దెబ్బ?

ఒకటి వీర క్లాస్.. ఇంకొకటి ఊర క్లాస్... మే నెల రెండు విశేషమైన సినిమాలను చూడబోతోంది.. రెండూ క్లాస్ సినిమాలు.. రెండింటికీ క్లాస్ డైరక్టర్లు.. అయితే క్లాసులో కూడా తేడా వుంటుందిగా.. వీటిలో ఒకటి వీర క్లాస్ అయితే మరొకటి ఊరక్లాస్ లా కనిపిస్తోంది. వీర క్లాస్ జాబితాలోకి చేరే సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలోని అ..ఆ. ఇక ఊర క్లాస్ లోకి చేరే సినిమా మహష్ బ్రహ్మోత్సవం.

మహేష్ లాంటి హీరో పాదాల ముందు ఒదిగిపోవడం, ఇప్పటి దాకా బయటికి వస్తున్న స్టిల్స్ చూస్తుంటే...ఈ సినిమా క్లాస్ వ్యవహారం ఓ లెక్కలో వుంటుందేమో అనిపిస్తోంది. చిన్న పాప..మహేష్ ను చూసి అందంగా వున్నాడు..పెళ్లి చేసుకోవాలి అనే ఎక్స్ ప్రెషన్ చూస్తే.. శ్రీకాంత్ మళ్లీ తన స్టయిల్ లోనే తీసాడు అన్నట్లుగా..అనిపిస్తోంది.. మొత్తం మీద మాస్ లో ఊరమాస్ అన్నట్లుగా, క్లాస్ లో ఊర క్లాస్ అన్నమాట. ఇక కొద్ది రోజుల్లో ట్రయిలర్ వస్తుంది అప్పుడు తెలుస్తాయి మరిన్ని సంగతులు.

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అ..ఆ ట్రయిలర్ బయటకు వచ్చింది..చూడ ముచ్చటగా వుంది. క్లాస్ సినిమా అని చెప్పకనే చెబుతోంది. అయితే ఆ మధ్య ఎప్పుడో మళ్లీ మళ్లీ ఇది రాని రోజు..ఓకె బంగారం అంటూ క్లాస్ లవ్ స్టోరీలు తెరపైకి వచ్చాయి. ఆ తరువాత చక్కటి భావోద్వేగాల ప్రేమకథను త్రివిక్రమ్ తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది. పైగా త్రివిక్రమ్ అంతగా నేల విడిచి సాము చేయడు..కామన్ మాన్ కు పట్టే కామెడీనే అందిస్తాడు. ట్రయిలర్ లో కామెడీ అంతగా కనిపించకపోయినా, సినిమాలో టన్నులకు టన్నులు వుండే వుంటుంది. 

ఎందుకంటే త్రివిక్రమ్ కదా. బ్రహ్మోత్సవం ట్రయిలర్ వచ్చేవరకు అంచనా వేయడం సరి కాదు కానీ, ఇప్పటికే బయటకు వచ్చిన ఆ సినిమా ఫస్ట్, సెకెండ్, థర్డ్, ఫోర్త్ లుక్కులూ, టీజర్లూ చూస్తుంటే, అ..ఆ దానికి పెద్ద థ్రెట్ ఏమో అనిపిస్తోంది. బ్రహ్మోత్సవం ముందు వచ్చి..అ..ఆ వెనక వస్తే ఏమో కానీ, ముందుగా అ..ఆ వచ్చి, ఆ పై బ్రహ్మోత్సవం వస్తే కాస్త ఇబ్బంది కావచ్చు.. ఎటొచ్చీ..బ్రహ్మోత్సవం సినిమాకు మహేష్ బాబే పెద్ద అండ. అ..ఆ సినిమాకు త్రివిక్రమ్ నే అన్నీ..

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?