Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బన్నీ సినిమా మరింత ఆలస్యం

బన్నీ సినిమా మరింత ఆలస్యం

లెక్కప్రకారం ఈ పాటికి బన్నీ-వక్కంతం సినిమా సెట్స్ పైకి వచ్చేయాలి. సినిమా ఓపెనింగ్ కూడా జరిగి చాలా రోజులైంది. స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపు పూర్తయింది. కానీ తాజాగా బన్నీ తీసుకున్న ఓ నిర్ణయంతో ఈ సినిమా మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

కథకు తగ్గట్టు మిలట్రీ మేన్ లా మారేందుకు దిట్టమైన ఫిజిక్ సంపాదించుకోవాలని ఫిక్స్ అయ్యాడు బన్నీ. దీని కోసం అమెరికా వెళ్లి, అక్కడి ట్రయినర్ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అల్లు అర్జున్ తీసుకున్న ఈ నిర్ణయం, నా పేరు సూర్య సినిమాను ఇంకాస్త లేట్ అయ్యేలా చేసింది.

బన్నీ కాస్ట్ లీ మేకోవర్ కు ఎంత వద్దనుకున్నా 3 వారాల టైం పడుతుంది. మినిమం 3 వారాల టైమ్ ఇవ్వందే ఫిట్ నెస్ ట్రయినర్ ఏమీ చేయలేడు. సో.. ఆగస్ట్ మొదటివారంలో ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందని ఇంతకుముందు మేకర్స్ చెప్పింది జరిగే ఛాన్స్ లేదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్ట్ నెలాఖరుకు ఇది సెట్స్ పైకి వస్తుంది.  లేదంటే సెప్టెంబర్ లోనే. 

మరోవైపు ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి. సంగీత దర్శక ద్వయం విశాల్-శేఖర్ ఈ సినిమాకు బాణీలు సమకూరుస్తున్నారు. అను ఎమ్మాన్యుయేల్ ను హీరోయిన్ గా సెలక్ట్ చేశారు. సీనియర్ నటులు అర్జున్, శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?