Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బన్నీ ఫ్రీగానే చేసాడట

బన్నీ ఫ్రీగానే చేసాడట

రుద్రమదేవి సినిమాకు బన్నీ ఇంతవరకు పారితోషికం తీసుకోలేదట. తరువాత చూద్దాం, ముందు సినిమా కానీండి అన్నాడట. అదే మాట మీద వుండి తన పాత్ర తను చేసి వెళ్లాడట. ఇంతవరకు కూడా పారితోషికం తీసుకోలేదట. ఈ విషయం బన్నీనే స్వయంగా చెప్పాడు. 

ఈ రోజు కొంతమంది మీడియాజనాలతో మాట్లాడుతూ, సినిమా మీద, గుణశేఖర్ మీద గౌరవంతో గన్నారెడ్డి పాత్ర చేసేందుకు ముందుకు వచ్చానని, పారితోషికం గురించి అస్సలు ఆలోచించలేదని అన్నాడు. గుణశేఖర్ కూడా ఇంతకు ముందే ఇదే విషయం వెల్లడించాడు. బన్నీ, నన్ను కావాలంటే వాడుకో అని వచ్చి, ప్రాజెక్టులో జాయిన్ అయ్యారని, చాలా ఆనందం వ్యక్తం చేసాడు. 

మొత్తానికి రుద్రమదేవి సినిమాలో బన్నీ పాత్ర హైలెట్ అవుతుందా కాదా అన్నది పక్కన పెడితే, గుణ శేఖర్ తో బన్నీ వ్యవహారశైలి మాత్రం హైలెట్ అనుకోవాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?