Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చైతన్యకు మారుతి కథ

చైతన్యకు మారుతి కథ

చైతన్యకు ఓ కథ చెప్పే యత్నంలో వున్నాడు దర్శకుడు మారుతి. యువి క్రియేషన్  తో వున్న ఒప్పందం మేరకు వారికి ఓ సినిమా చేయాలి. అందుకోసం తయారు చేసిన లైన్ ను ఇప్పటికే నాని, గోపీచంద్ ఇద్దరూ ఒకె అన్నారని వినికిడి. అయితే నాగ చైతన్యకు కూడా ఆ కథ చెప్పాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. చైతన్య ఒకె అంటే మారుతితో కాంబినేషన్ ఓకె అవుతుంది. లేదంటే మిగిలిన వారితో ఒకె అవుతుంది.

మీడియం రేంజ్ హీరోలు ఎవరికీ సూపర్ కాదు కదా, ఓకె అనే ఓపెనింగ్స్ వుండడం లేదు. సినిమాకు మరీ భారీ పబ్లిసిటీ చేసినా కూడా. ఆ విషయంలో చైతన్యే కాస్త బెటర్ అందుకే ఇప్పుడు నిర్మాతలు అటు చూస్తున్నారు. ఆ క్రమంలోనే యువి సంస్థకూడా చైతన్యకు కథ చెప్పించాలని చూస్తోంది. దీపావళి వెళ్లాక వింటానని చైతన్య చెప్పినట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?