Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాహుబలి-2ను క్రాస్ చేసిన దంగల్

బాహుబలి-2ను క్రాస్ చేసిన దంగల్

అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా బాహుబలి-2ను క్రాస్ చేసింది. ఏదో ఒక టైమ్ లో ఇది జరుగుతుందని అంతా ఊహించారు. నిన్నటి వసూళ్లతో కలుపుకొని వరల్డ్ వైడ్ వసూళ్లలో బాహుబలి-2ను అధిగమించింది దంగల్ సినిమా. ప్రస్తుతానికి వరల్డ్ వైడ్ వసూళ్లలో నంబర్ వన్ ఇండియన్ మూవీ దంగల్ సినిమానే. చైనాలో ఆదివారం వసూళ్లతో కలుపుకొని దంగల్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 1662 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

బాహుబలి-2 సినిమా విడుదలైన అన్ని ఏరియాస్ లో బాగా ఆడుతున్నప్పటికీ.. చైనా బాక్సాఫీస్ వద్ద దంగల్ సృష్టిస్తున్న ప్రకంపనల ముందు మిగతా బాక్సాఫీస్ లెక్కలు తేలిపోయాయి. ఆదివారానికి చైనాలో దంగల్ సినిమాకు 885 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. అటు తైవాన్ లో కూడా ఈ సినిమాకు 32 కోట్లు వచ్చాయి. వీటికి ఇండియా, ఓవర్సీస్ వసూళ్లు కూడా కలుపుకుంటే.. దంగల్ కు నిన్నటికి 1662 కోట్లు గ్రాస్ వచ్చింది.

అలా దంగల్ మూవీ వరల్డ్ వైడ్ వసూళ్లలో నంబర్ వన్ ఇండియన్ మూవీగా అవతరించింది.అమీర్ నటించిన ఈ మూవీకి చైనాలో ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. విడుదలై 3 వారాలు అయినప్పటికీ.. రిపీటెడ్ ఆడియన్స్ పెరగడంతో బాక్సాఫీస్ వద్ద స్టడీగా ఉంది. మరోవైపు దంగల్ రికార్డుల్ని క్రాస్ చేసేందుకు బాహుబలి టీం మరిన్ని దేశాల్లో తమ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా జూన్ లో చైనాతో పాటు యూరోప్ లోని కొన్ని దేశాల్లో బాహుబలి-2 సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు రెడీ అవుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?