Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

దసరాకు ప్రీ క్లయిమాక్స్

దసరాకు ప్రీ క్లయిమాక్స్

టాలీవుఢ్ కు అసాలు సిసలైన సినిమా సీజన్లు రెండు ఒకటి సంక్రాంతి, రెండు దసరా. ఈ ఏడాది సంక్రాంతి అంత సందడిగా సాగలేదు. అనుకున్న మేరకు విడుదలలు లేక, ఒకటి రెండు సినిమాలతో సరిపోయింది. కానీ ఈసారి దసరా సీజన్ అదిరిపోయేలా వుంది. అసలు దసరా సీజన్ కన్నా, ఓ నెల ముందుగానే సినిమాల దాడి మొదలవుతోంది. అక్టోబర్ 22న దసరా. అంటే దానికి ఓ రెండువారాలు ముందుగా దసరా సీజన్ స్టార్ట్ కావాలి. అప్పటికి ఓ నెల ముందుగానే సినిమాల సందడి ప్రారంభమైపోతోంది. 

సెప్టెంబర్ నాలుగున ఇప్పటికి మూడు సినిమాలు ఖరారయ్యాయి. భలే భలే మగాడివోయ్, డైనమేట్, జయసూర్య. ఈ మూడు మీడియం రేంజ్ సినిమాలే కానీ, వేటి క్రేజ్ వాటికి వుంది. అదే నెల 11న నితిన్ సినిమా 'కొరియర్ బాయ్ కళ్యాణ్', వస్తోంది. 18న రుద్రమదేవి రావడానికి అవకాశం వుంది. 24న దిల్ రాజు-హరీష్ శంకర్ ల సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ రెడీ అయింది. ఆ తరువాతి వారం అంటే అక్టోబర్ 2 నుంచి వరుసగా విడుదలలు వున్నాయి. అంటే ఈ సారి దసరా, దసరా ముందు నెల సినిమా అభిమానులకు పండగే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?