Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

దిల్ రాజు 80 ప్రాఫిట్-30 లాస్?

దిల్ రాజు 80 ప్రాఫిట్-30 లాస్?

టాలీవుడ్ లో 2017 విజేత ఎవరు? అంటే టక్కున చెప్పేసే పేరు దిల్ రాజు. నిర్మాతగా ఈ ఏడాది అయిదు సినిమాలు అందించారు. జనవరిలో శతమానం భవతి, ఆ తరువాత వరుసగా నేను లోకల్, డిజె, ఫిదా, లేటెస్ట్ గా రాజా ది గ్రేట్. ఇంకా ఆరో సినిమా ఈ ఏడాదిలోనే వుండనే వుంది. సాయిధరమ్ తేజ హీరోగా నిర్మించిన జవాన్. దాదాపు విడుదలైన అన్ని సినిమాలు నిర్మాతగా లాభాలను తెచ్చిపెట్టాయి. శతమానం భవతి, నేను లోకల్ సంగతి చెప్పనక్కరలేదు. డిజె అమ్మాకాల ద్వారా బాగానే ఆర్జించారు. ఇక ఫిదా అయితే బంగారు బాతుగుడ్డు అయిపోయింది. లేటెస్ట్ గా రాజా ది గ్రేట్ కూడా థియేటర్ అమ్మకాలు, డిజిటల్ శాటిలైట్ అమ్మకాలతో బాగానే మిగల్చుకున్నారని వినికిడి.

ఇలా అన్ని విధాలా ఈ అయిదు సినిమాలతో దిల్ రాజు ఈ ఏడాది 80కోట్ల మేరకు లాభం ఆర్జించారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇందులో సింహభాగం ఫిదా సినిమాదే. ఆ తరువాత శతమానం భవతి, నేను లోకల్ కూడా బాగానే ఆర్జించి పెట్టాయి. నైజాం, వైజాగ్ ఏరియాలు తనే వుంచుకోవడం వల్ల వచ్చిన లాభాలు ఇవి. ఫిదా ఒక్క నైజాం ఏరియాలోనే 18కోట్లు అచ్చంగా అదించింది. అంటే ఈ ఏడాది లాభాల్లో పాతిక శాతం ఒక్క సినిమాకు, ఒక్క ఏరియాలో వచ్చిందన్నమాట.

ఇక డిజె అమ్మకాల ద్వారా బాగానే ఆర్జించారు. రాజా ది గ్రేట్ థియేటర్ అమ్మకాలు, శాటిలైట్, డిజిటల్ రైట్స్ బాగానే వచ్చాయి. అందువల్ల మొత్తంగా ఇప్పటికి ఈ ఏడాది 80కోట్ల వరకు దిల్ రాజు ఆర్జించినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

నష్టాలు వున్నాయి

కానీ ఇదే సమయంలో డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు చాలా దెబ్బలు తిన్నారు. జనవరిలో ఓం నమో వెంకటేశాయతో దెబ్బలు తినడం ప్రారంభమైంది. ఇప్పటి స్పైడర్ దాకా అది కొనసాగుతూనే వుంది. ఈ ఏడాది పెద్ద సినిమాల పంపిణీ ఏదీ దాదాపుగా దిల్ రాజుకు కలిసి రాలేదనే చెప్పుకోవాలి. ఇలా అన్ని పెద్ద సినిమాల పంపిణీ కారణంగా దిల్ రాజుకు ఈ ఏడాది 30 కోట్లకు పైగా నష్టాలు వాటిల్లినట్లు, ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు సిసలు ఫిగర్ ఈ సంఖ్యకు కాస్ అటుగానే వుంటుంది కానీ, ఇటుగా అయితే మాత్రంకాదు. 

మొత్తంమీద 80కోట్ల నిర్మాణ లాభాన్ని యాభైకోట్లకు పరిమితం చేసింది ముఫైకోట్ల పంపిణీ నష్టం దిల్ రాజుకు. అయినా కూడా ఫరావాలేదు. ఎందుకంటే మంచి ప్రాజెక్టులు చేతిలో వున్నాయి. మహేష్ బాబు-వంశీ పైడిపల్లి, నాని-వేణు శ్రీరామ్, రాజ్ తరుణ్-అనీష్, నిఖిల్-చందు మొండేటి ప్రాజెక్టులు ఇప్పటికి కన్ఫర్మ్ అయినవి. ఇవికాక ఇంకా డిస్కన్లలో వున్నవీ  వున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?