Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

దిల్ రాజు డబ్బులు వచ్చేసాయా?

దిల్ రాజు డబ్బులు వచ్చేసాయా?

దగ్గర దగ్గర పాతిక కోట్లు పెట్టి బాహుబలి హక్కులు తీసుకున్నాడు దిల్ రాజు. పాతిక కోట్ల షేర్ రావాల్సి వుంటుంది. ధియేటర్ రెంట్ లు, ఇతర ఖర్చులు పోను అన్నమాట. అంటే గ్రాస్ దగ్గర దగ్గర నలభై నుంచి యాభై కోట్లు రావాలి. ఇప్పటికైతే థియేటర్ అడ్వాన్స్ ల రూపంలో డబ్బులు వచ్చి చేరిపోయాయని వినికిడి. కానీ అవన్నీ అడ్వాన్స్ లే. తేడావస్తే వెనక్కు ఇవ్వాల్సినవే. నైజాం హయ్యస్ట్ గ్రాసర్లలో గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది వున్నాయంటారు. అవే ముఫై నుంచి ముఫై అయిదు కోట్లు దాటలేదు అని టాక్. 

మరి ఎంత పిచ్చ క్రేజ్ వున్నా, 99శాతం థియేటర్లలో అదే సినిమా విడుదల చేసినా, నలభై నుంచి యాభై కోట్లు వసూలు చేయాల్సిన రేంజ్ లవుండాలి బాహుబలి. 

సినిమా ఎలా వున్నా, ప్రతి ఒక్క ప్రేక్షకుడు, ఇటీవలి కాలంలో థియేటర్ కు రాని వాళ్లు కూడా వచ్చి చూసి తీరతారని టాలీవుడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 

నిజానికి అరుంధతి, మగధీర, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, దూకుడు లాంటి సినిమాలు వారాల తరబడి టికెట్ లు దొరకని పరిస్థితుల్లో ఆడాయి. ఇప్పుడు తొలివారమే డబ్బులు వచ్చేలా ప్లాన్ చేసారు. అన్ని థియేటర్లలో, మాగ్జిమమ్ షోలు వేస్తున్నారు. అంటే పైరసీ సీడీ వచ్చేలోగా డబ్బులు వచ్చేయాలని. సీడీ వచ్చిందా, వ్యవహారం తేడా అయిపోతుంది. అందుకే పైరసీపై బాహుబలి టీమ్ అంత కలవరపడుతోంది. 

కానీ పైరసీని అరికట్టడం అసాధ్యం.అందునా ఇన్ని భాషల్లో విడుదల చేస్తున్నపుడు మరీనూ. సినిమాకు పదిశాతం నెగిటివ్ టాక్ వచ్చినా, లేదా వారంలో సీడి వచ్చినా బాహుబలి టార్గెట్లు రీచ్ కావడం కష్టం అవతుంది. అలా కాకుండా యునానిమస్ సూపర్ టాక్ వస్తే, ఫరావాలేదు. అప్పుడు కూడా పైరసీని ఓ కంట కనిపెడుతూ వుండాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?