Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

'డర్టీపిక్చర్‌'పై కన్నేసిన సన్నీలియోన్‌

'డర్టీపిక్చర్‌'పై కన్నేసిన సన్నీలియోన్‌

బాలీవుడ్‌లో 'డర్టీపిక్చర్‌' సినిమా చుట్టూ ఎన్ని వివాదాలు ముసురుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! వివాదాల సంగతెలా వున్నా, సినిమా మాత్రం సంచలన విజయాన్ని అందుకుంది. అప్పట్లో 'డర్టీపిక్చర్‌' సృష్టించిన వసూళ్ళ సునామీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. విద్యాబాలన్‌ ఆ సినిమాలో రెచ్చిపోయి అందాల విందు చేయడమే కాదు, అద్భుతమైన నటనతోనూ ఆకట్టుకుంది. 

ఇప్పుడీ 'డర్టీపిక్చర్‌' మేటర్‌ ఎందుకంటే, 'డర్టీపిక్చర్‌' లాంటి సినిమా తనకూ చెయ్యాలని వుందంటూ సన్నీలియోన్‌ వ్యాఖ్యానించింది గనుక. విద్యాబాలన్‌ని మించి సన్నీలియోన్‌ ఎక్స్‌పోజింగ్‌ అయితే చెయ్యగలదేమోగానీ, విద్యాబాలన్‌ స్థాయిలో నటనా ప్రతిభను చూపించలేదు కదా.? ఈ ప్రశ్నకీ ఆమె వద్ద బదులుంది. నటన విషయంలో విద్యాబాలన్‌తో పోటీ పడలేనుగానీ, ప్రయత్నించి చూస్తాననని సన్నీలియోన్‌ ఏమాత్రం మొహమాటపడకుండా అసలు విషయం చెప్పేసింది. 

పోర్న్‌ స్టార్‌గా ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న సన్నీలియోన్‌, బాలీవుడ్‌కి వచ్చాక తన ఆలోచనల్ని చాలావరకు మార్చేసుకుంది. డీ గ్లామర్ లుక్ కూడా ట్రై చేస్తానని కూడా అంటోంది. గ్లామర్ మాత్రమే కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తానని చెబుతోంది. డాన్సుల్లోనూ ప్రత్యేక శిక్షణ తీసుకుని, మంచి డాన్సర్ అనిపించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతానికి చేస్తున్నవన్నీ దాదాపుగా వెండితెరని హీటెక్కించే సినిమాలే. అయినాసరే, ఏదో కొత్తగా ట్రై చేయాలన్న ఆమె తపనని అభినందించకుండా వుండలేం. ఏమో, సన్నీలియోన్‌ కోరుకున్నట్టే, ఆమెకు 'డర్టీపిక్చర్‌' లాంటి సినిమా తగులుతుందేమో.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?