Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

ఈ దసరా దిల్ రాజుదే

ఈ దసరా దిల్ రాజుదే

సినిమా ఇండస్ట్రీలో తమ హవా చాటుకోవడానికి, లేదా నిలుపుకోవడానికి కొంతమంది ఏళ్ల కొద్దీ కృషి చేసారు. ఇండస్ట్రీ చెన్నయ్ నుంచి ఆంధ్రకు తరలి వచ్చినపుడు చాలా తెలివిగా ఇన్ ఫా స్ట్రక్చర్ అంతా తమ చేతిలోకి వుండేలా చూసుకున్నారు. అలా కష్టపడి, ఏళ్ల కొద్దీ టైమ్ తీసుకుంటే ఇండస్ట్రీ కొద్ది మంది చేతుల్లోకి వెళ్లింది. తద్వారా ఆ కొద్దిమంది తాలూకా జనాలే హీరోలుగా మనగలిగారు.

కానీ జస్ట్ కొన్నేళ్లలోనే సీన్ మార్చేసాడు నిర్మాత దిల్ రాజు. తయారీ కాదు ప్రధానం, మార్కెటింగ్ ముఖ్యం అన్న కీలక సూత్రాన్ని సినిమాకు కూడా అప్లయ్ చేసి, థియేటర్ రంగాన్ని తన చేతుల్లోకి తీసుకుని, ఇప్పుడు ఇండస్ట్రీలో కింగ్ పిన్ గా మారిపోయారు. ఇప్పుడు ఇండస్ట్రీలో నైజాంలో దిల్ రాజు హవాకు తిరుగుతలేదు. ఇక్కడ ఆసియన సునీల్ మాత్రమే కాస్త పోటీ.

ఆంధ్రలో కీలకమైన ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో మళ్లీ దిల్ రాజే హవా చలాయిస్తున్నారు. ఈస్ట్, కృష్టా, గుంటూరు, నెల్లూరు, సీడెడ్ ప్రాంతాల్లో గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్, లాంటి సంస్థలతో టై అప్ పెట్టుకున్నారు. దీంతో ఆంధ్రలో ఒక్క సురేష్ మూవీస్ మాత్రమే పోటీగా వుంది.

దీంతో ఇప్పుడు ఏ సినిమా అయినా దిల్ రాజు కొనాల్సిందే. లేదా టేకప్ చేయాల్సిందే. ఈ దసరాకు పోటాపోటీగా మూడు నాలుగు సినిమాలు వస్తున్నాయి. అన్నీ దిల్ రాజు హ్యాండ్ వున్నవే. 21న విడుదలవుతున్న జై లవకుశ సినిమాకు నైజాం, విశాఖ దిల్ రాజే. స్పైడర్ సినిమాకు డిటో.. డిటో. అంతే కాదు, స్పైడర్ సినిమాను దిల్ రాజుతో వ్యాపార సంబంధాలున్నవారే మరి కొన్ని ఏరియాలకు తీసుకున్నారు. ఇక మహానుభావుడు సినిమా దిల్ రాజుతో వ్యాపార సంబంధాలున్న యువి క్రియేషన్స్ దే. ఈ సినిమాలకు కాస్త దూరంగా వచ్చే రవితేజ రాజా దీ గేట్ సినిమా దిల్ రాజుదే.

ఇదిలా వుంటే ఇప్పటికీ దిల్ రాజు ఫిదా సినిమా థియేటర్లలో వుంది. ఇప్పుడు ఫిదాను ఇక తీసేయక తప్పని సరి పరిస్థితి. ఆపైన జైలవకుశ, స్పైడర్, మహానుభావుడు సినిమాలకు థియేటర్లు సెట్ చేయాలి. ఎవరికీ తక్కువ చేయడానికి లేదు, ఎక్కువ చేయడానికి లేదు. ఎన్టీఆర్ తో అన్ని రకాల అనుబంధాలు దిల్ రాజుకు వున్నాయి. మహేష్ బాబుతో సినిమా నిర్మాణంలో వుంది. అందువల్ల ఎక్కడా తేడా రాకూడదు.

మొత్తం మీద ఇవ్వాళ ఇండస్ట్రీలో సినిమా ఎవరిదైనా, హీరో ఎవరైనా, హడావుడి అంతా దిల్ రాజు ఆఫీసుల్లోనే. దసరా హడావుడి కూడా కేరాఫ్ దిల్ రాజు ఆఫీసే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?