Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఈ ఓవర్ యాక్షన్ ఏమిటి పవన్?

ఈ ఓవర్ యాక్షన్ ఏమిటి పవన్?

పవన్ కళ్యాణ్ భలే తెలివైన వాడు. రాజకీయ నాయకులు ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్లు, ఈయన గారు వెళ్లే సమావేశం, కలిసే జనాలకు తగినట్లు డ్రెస్ వేసుకుని వెళ్తారు. బాబు దగ్గరకు వెళ్తే డిప్లమాటిక్ గా, జనాల దగ్గరకు వెళ్తే మాసిన గెడ్డం, లాల్చీ, పైజామాలు, ఇలా అబ్బో భలే గెటప్ లు వేస్తారు.

ఇవ్వాళ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన జెండా వందనం చేసారు. భలే సినిమాటిక్ వ్యవహారం అనిపిస్తుంది అవి చూస్తుంటే. జెండాకు వందనం చేస్తారు. అది భారతీయుడిగా మన విధి, మన ధర్మం. కానీ జెండా దిమ్మపై తల ఆనించి, గర్భగుడి ముందు వున్న ధ్వజ స్తంభం దిమ్మకు మొక్కినట్లు మొక్కరు. ధ్వజ స్తంభం దిమ్మ వేరు. జెండా దిమ్మ వేరు.

జెండా కర్ర నిలదొక్కు కోవడం కోసమే, దిమ్మ కడతారు. కొన్ని చోట్ల జెండాకు కట్టిన తాడు లాగడానికి అవసరం అయితే జెండా దిమ్మ మెట్లను కూడా వాడతారు. జెండా పాతిన భూమికి మొక్కొచ్చు. అది కామన్. పుణ్యభూమి. జన్మభూమి కాబట్టి, జెండా దిమ్మకు తల ఆనించి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం అంటే జనం కాస్త ఓవర్ యాక్షన్ అనుకునే ప్రమాదం వుంది.

నిన్నే శుభాకాంక్షలు

పైగా పవన్ కళ్యాణ్ దేశ ప్రజలకు నిన్నటికి నిన్నే అడ్వాన్స్ అని కూడా అనకుండా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేసారు. సంబరం ఈ రోజే అయితే నిన్నే చెప్పడం ఏమిటో? సామాజిక మాధ్యమాలు లేని కాలంలో మర్నాడు ప్రింట్ మీడియాలో రావడం కోసం ముందు రోజు ప్రకటనలు ప్రెస్ కు అందించే అలవాటు వుండేది. అంతే కానీ అప్పటికప్పుడే అంతటికీ చేరిపోయే ఈ కాలంలో కాదు. పైగా ఒక రోజు ముందు జరిగేది పాక్ స్వాతంత్ర్య దినోత్సవం. మరి పవన్ ముందు రోజే చెబితే ఏమనుకోవాలి?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?